రెండు తెలుగు రాష్ట్రాలలో బారి విజయం కోసం ప్రయత్నం
- August 29, 2017
ఈ రోజుల్లో సినిమాకి ఎంత ఎక్కువగా ప్రమోషన్ చేస్తే అంత ప్లస్ అవుతుంది. అందుకే అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య కూడా, తన కొత్త సినిమా యుద్దం శరణం మూవీకి డిఫరెంట్ గా ప్రమోషన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. యుద్దంశరణం కోసం చైతూ ఎలాంటి ప్రమోషన్స్ ని ప్లాన్ చేశాడో తెలుసా..?
అక్కినేని వారసుడు నాగ చైతన్య వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. ఓ వైపు తండ్రి సలహాలు తీసుకుంటూనే తనదైన శైలిలో విజయాలను అందుకుంటున్నాడు. ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం వంటి హిట్స్ అందుకొని ఈ సారి మరో హిట్ ను అందుకొవాలని బాక్స్ ఆఫీస్ తో యుద్దానికి రెడీ అయ్యాడు చైతూ. తమిళనాడుకు చెందిన కృష్ణ మరిముత్తు అనే స్నేహితుడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, నాగచైతన్య నటించిన "యుద్ధం శరణం" సినిమాను సెప్టెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఇంతకు ముందు తీసిన చిత్రాలకు బిన్నంగా యాక్షన్-థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న యుద్దంశరణంతో ఎలాగైనా హిట్ కొట్టాలనుకుంటున్నాడు. అందుకోసం ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. అందుకే రిలీజ్ కు ముందే ఆంద్రప్రదేశ్- తెలంగాణ లోని మెయిన్ సెంటర్స్ లో ప్రమోషన్స్ ని భారీ స్థాయిలో చేసేందుకు సన్నద్ధమవుతున్నాడట. అందుకోసం చిత్ర నిర్మాత సాయికొర్రపాటి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. యుద్దం శరణం మూవీలో చైతు సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ పాత్ర గ్లామర్ తో పాటు పెర్ఫార్మెన్స్ తోనూ ఆకట్టుకుంటుందంటున్నారు యూనిట్ సభ్యులు. ఇక శ్రీకాంత్ ఈ మూవీలో నెగిటివ్ రోల్ పోషిస్తున్నాడు. ఇందులో శ్రీకాంత్ గెటప్ కి చాలా మంచి పేరు వచ్చింది. ఇక రావు రమేష్, రేవతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. యుద్దం శరణం మూవీతో చైతన్న మరో హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







