ఆపరేషన్ థియేటర్ లో కొట్టుకున్న డాక్టర్లు.... తల్లీబిడ్డ మరణం
- August 29, 2017
ప్రాణం పోసేది దేవుడైతే ఆ ప్రాణానికి అత్యవసర సమయంలో చికిత్స అందించి ప్రాణాలు కాపాడతారు వైద్యులు. ఆపరేషన్ థియేటర్లో అన్నీ మర్చిపోయి పేషెంట్ ప్రాణాలు కాపాడ్డానికి శతవిధాల ప్రయత్నిస్తారు. అలాంటి డాక్టర్స్ పురిటినొప్పులు పడుతున్న ఓ మహిళకు ఆపరేషన్ చేసే సమయంలో పోట్లాటకు దిగి బిడ్డ ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు. ప్రాణం పోయాల్సిన డాక్టర్లే ప్రాణం తీశారు. రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌లో జరిగిందీ విషాదకరమైన ఘటన. ఇద్దరు వైద్యులు గర్భిణికి డెలివరీ చేస్తున్న సమయంలో గొడవ పడ్డారు. తీవ్రస్థాయిలో దూషించుకున్నారు. పక్కనే ఉన్న సిబ్బంది వారిస్తున్నా పట్టించుకోలేదు. ఈ ఇద్దరి డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా చివరికి తల్లీబిడ్డా కన్నుమూశారు. ఓ నర్స్ మొత్తం గొడవను వీడియో తీయడంతో విషయం వెలుగు చూసింది. ఇప్పుడీ ఫుటేజ్ వైరల్‌గా మారడంతో ఆస్పత్రి యాజమాన్యం దీనిపై విచారణ జరిపింది. బాధ్యులైన ఇద్దరు డాక్టర్లపై వేటు వేసింది.
తాజా వార్తలు
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్







