కార్మికులకు సహాయంగా వేసవి స్వచ్ఛంద కార్యక్రమం
- August 30, 2017
వేసవి ఉష్ణోగ్రతలు గత నెలరోజుల నుంచి పతాక స్థాయికి చేరుకొన్నాయి. తక్కువ ఆదాయం గల కార్మికుల అవస్థలను దృష్టిలో ఉంచుకొని బహ్రెయిన్ మలయాళీ బిజినెస్ ఫోరమ్ యువజన విభాగం సభ్యులు నిర్వహించిన వేసవి దాతృత్వ కార్యక్రమంలో భాగంగా పలువురు కార్మికులకు నీటి బాటిళ్లను , పండ్ల రసాన్ని, ఆహారాన్ని పంపిణీ చేస్తూ సాటి మనిషిపై సానుభూతిని ప్రదర్శిస్తున్నారు. 'హెల్ప్ అండ్ డ్రింక్ 2017' పేరిట 35 మంది కార్యకర్తలచే ఈ సేవా కార్యక్రమంను ఎంతో క్రమశిక్షణతో అమలుచేస్తున్నారు. వీరిలో అత్యధికులు యువకులు, వీరి ఆధ్వర్యంలో ఇప్పటికే 14000 తాగునీటి సీసాలను పంపిణీ చేశారు. ప్రస్తుత వేసవికాలంలో చాలా మంది శ్రామికులు ఎర్రని ఎండలలో పని చేస్తున్నారు. ఈ వేడి వాతావరణంలో వారికి నీరు లేదా ఆహారం లభిస్తే అది వారికి గొప్ప ఉపశమనం ఉంటుందని బహ్రెయిన్ మలయాళీ బిజినెస్ ఫోరమ్ వ్యవస్థాపకుడు, కార్యదర్శి బషీర్ అమ్బలాయి " మా గల్ఫ్ డాట్ కామ్ " తో చెప్పారు. ఈ వితరణను వీధి క్లీనర్లు, రహదారి నిర్వహణ కార్మికులు, నిర్మాణ కార్మికులు మరియు అవసరమైన ఇతర కార్మికులకు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. . ఉదయం 5 గంటల నుండి పంపిణీ ప్రారంభమవుతుందని అలాగే ఉదయం 8 గంటల వరకు కొనసాగుతుంది. అదేవిధంగా శుక్రవారాలు పంపిణీ ఉదయం 10 గంటల వరకు కొనసాగుతుందని చెప్పారు. ఈ పంపిణీ విజయవంతం కావడానికి , మా స్పాన్సర్ల మద్దతు ప్రధాన కారణమని వారు మాకు తగినంత నీరు మరియు ఆహారంయొక్క ప్యాకెట్లను మాకు సహాయం చేయడం ద్వారా వితరణ సాధ్యమవుతుందని వివరిస్తూ ఈ కార్యక్రమం సెప్టెంబరు 8 వ తేదీన ముగిస్తుందని బషీర్ అమ్బలాయి తెలిపారు.
తాజా వార్తలు
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









