జయ శోభన్ బాబుల కూతురుని నేను డీఎన్ ఏ టెస్ట్ కు కూడా రెడీ..
- August 30, 2017
ప్రముఖ సినీ హీరో హీరోయిన్లు శోభన్ బాబు, జయలలిత ల మధ్య స్నేహం కన్నా మించిన అనుబంధం ఉన్నదనే టాక్.. ఇద్దరు కొంత కాలం ప్రేమించుకొన్నారని.. పెళ్లి కూడా చేసుకోవాలను కొన్నారు అని అప్పట్లో టాక్ ఉన్నదట. అప్పట్లో శోభన్ బాబు మించిన అందగాడు లేదు.. దీంతో సోగ్గాడు అని పిలుచుకొనే వారు.. ఎంతో మంది అభిమానులు శోభన్ బాబు కోసం చూస్తే.. శోభన్ బాబు మాత్రం జయలలిత అంటే ఇష్టపడేవారట. ఆమె కలిసి ఓ సినిమా ఐనా చేయాలని దాదాపు 8 ఏళ్ళు ఎదురు చూశారంటే ఎంత వ్యామోహమో అర్ధం చేసుకోవచ్చు. అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్న శోభన్ బాబు...... అప్పటికే స్టార్ హీరోయిన్ గా జయలలిత.. ఓ నిర్మాత శోభన్ బాబు కి అడ్వాన్స్ ఇచ్చి నువ్వు హీరో, జయలలిత హీరోయిన్ అని చెప్పి ఆశలు రేపగా శోభన్ బాబు చిన్న హీరో అని జయలలిత తల్లి ఆ సినిమాను రిజెక్ట్ చేసింది.అనంతరం శోభన్ బాబు కి ఎనిమిదేళ్ళ తర్వాత జయలలిత తో నటించే అవకాశం వచ్చింది. డాక్టర్ బాబు సినిమా లో శోభన్ బాబు, జయలలిత లు కలిసి నటించారు. ఆ సినిమా సూపర్ హిట్. జయలలిత తల్లి సంధ్య మరణించిన తర్వాత ఒంటరి అయ్యింది. ఆ సమయంలో సోగ్గాడు పరిచయం ఆమెలో జీవితం పట్ల ఆశలు రేకెత్తించాయి. నవ్వుతూ నవ్విస్తూ ఉండే శోభన్ బాబు నేచర్ జయని ఆకర్శించింది. శోభన్ బాబు లో అమ్మ ఆత్మీయని చూసిన జయ శోభన్ బాబు పై ప్రేమని పెంచుకొన్నది.. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిది. అనంతరం ఇద్దరి కాంబినేషన్ లో చాలా చిత్రాలు వచ్చాయి. ప్రేమ ముదిరి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట.. కానీ అప్పటికే శోభన్ బాబుకి పెళ్లి అయ్యింది.. అయిన సరే జయలలిత ని రెండో భార్య గా చేసుకోవడానికి అంగీకరించరాట.. వీరిద్దరి ప్రేమకు గుర్తుగా ఓ పాప అనే పుకార్లు కూడా అప్పట్లో షికారు చేశాయి.. ఆ పుకార్లు నిజం అంటూ వారిద్దరి ప్రేమ కు ప్రతి రూపం నేను అంటూ అమృత అనే మహిళ తెరపై కి వచ్చింది.. తాను శోభన్ బాబు, జయలలిత కూతుర్ని అని.. కావాలంటే డీఎన్ ఏ పరీక్ష చేయించుకోవాల్సింది అని చెప్పడంతో ప్రస్తుతం టాక్ ఆఫ్ ది సౌత్ సినీ ఇండస్ట్రీ టాక్ గా మారింది. తన తల్లిదండ్రులు కొన్ని కారణాలతో పెళ్లి చేసుకోలేదని.. వారి ప్రేమకు ప్రతి రూపం తానే అని అమృత తెలిపింది. తనను తన తల్లి జయ చెల్లెలు శైలజ, సారధి దంపతులకు పెంపకానికి ఇచ్చారని.. తాను ఎవరనేది ఎవరికీ ఎప్పటికీ చెప్పవద్దు అని వారితో ఒట్టు వేయించుకొన్నారు అని తెలిపింది. 1996 లో తాను జయను కలుసుకొని అంతా వివరంగా చెబితే ఆమె తనని హత్తుకొన్నట్లు తెలిపింది. కానీ ఆ సమయంలో తనకు జయ తల్లి అనే విషయం తెలియదు అని లేఖ లో పేర్కొన్నారు. ఇప్పడు అమృత లేఖ ఇండస్ట్రీ హాట్ హాట్ న్యూగ్ గా హల్ చల్ చేస్తోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







