ఆధార్ అనుసంధానంపై సుప్రీంకోర్టు మరో ఊరట
- August 30, 2017
ఆధార్ లింకింగ్ అంశంపై సుప్రీంకోర్టు మరో ఊరట కల్పించింది. వివిధ ప్రభుత్వ పథకాలకు ఆధార్ అనుసంధానం గడువును పొడిగించాలని ఆదేశించింది. ఆధార్‌లింక్‌పై బుధవారం విచారించిన సుప్రీం ఈ గడువును మరో మూడు నెలల పాటు పొడిగించాలని ఆదేశించింది. ఈ సెప్టెంబర్ 30తో ముగియనున్న గడువును డిసెంబరు31వరకు పొడిగించాలని ధర్మాసనం ప్రకటించింది. తదుపరి విచారణను నవంబరుకు వాయిదా వేసింది. ఈ విషయంపై వాదనలు వినడానికి అంత తొందర ఏమీలేదని ధర్మాసనం పేర్కొంది.
వివిధ సంక్షేమ పథకాలకు ఆధార్ లింకింగ్‌ను గడువును పొడిగించాలని సుప్రీం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో అటార్నీ జనరల్ కె.కె. వేణుగోపాల్ మరో మూడు నెలలపాటు ఈ గడువును పొడిగించనున్నామని కోర్టుకు చెప్పారు. చీఫ్ జస్టిస్ దీపాక్ మిశ్రా బెంచ్, జస్టిస్ అమితావ రాయ్, జస్టిస్ ఎ.ఎం. ఖాన్విల్కర్ లతో కూడిన ధర్మాసనం ఆధార్ వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘింఘనపై తదుపరి విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించింది. నవంబర్ మొదటి వారంలో తదుపరి విచారణ ఉంటుందని ఖాన్విల్కర్ చెప్పారు.
కాగా వివిధ సామాజిక సంక్షేమ పథకాల ప్రయోజనాల కోసం ఆధార్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ మూడు వేర్వేరు పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. వివిధ పిటిషనర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ బెంచ్ ముందు తమ వాదనలు వినిపించారు .కేంద్రం ప్రభుత్వం గతంలోజారీ చేసిన ఆదేశాల ప్రకారం సంక్షేమ పథకాలకు ఆధార్ లింకింగ్ గడువు సెప్టెంబర్ 30తో ముగియనుంది. అయితే తాజా నిర్ణయం ప్రకారం ఈ గడువు డిసెంబర్ 31వరకు పొడిగించినట్టయింది.
తాజా వార్తలు
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









