యూఏఈ: 1907 మంది ఖైదీలకు క్షమాభిక్ష
- August 31, 2017
యూఏఈ నాయకత్వం 1,907 మంది ఖైదీల విడుదలకు మార్గం సుగమం చేసింది. ఈద్ అల్ అదా సందర్భంగా ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించడం జరిగింది. సోమవారం, ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, అబుదాబీలో 803 మంది ఖైదీలకు క్షమాభిక్షను అదించారు. వైస్ ప్రెసిడెంట్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ 543 మంది ఖైదీలకు క్షమాభిక్షను మంగళవారం ప్రసాదించారు. షార్జా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమి 117 మంది ఖైదీలకు క్షమాభిక్షను ప్రకటించడం జరిగింది. అజ్మన్ రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ షేక్ హుమైద్ బిన్ రషీద్ అల్ నౌమి 92 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. ఫుజారియా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ షేక్ హమాద్ బిన్ మొహమ్మద్ అల్ షర్కి 47 మంది ఖైదీలకు క్షమాభిక్షను ప్రకటించారు. అల్ ఖైమా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ షేక్ సౌద్ బిన్ సక్ర్ అల్ కాసిమి 305 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. క్షమాభిక్ష పొందిన వారు తిరిగి సాధారణ జీవితం గడపాలనీ, సమాజంలో భాగమై సమాజం మేలు కోసం తమవంతు కృషి చేయాలని పాలకులు, అధికారులు, సామాజిక వేత్తలు ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







