రస్‌ అల్‌ఖైమాలోని ఫ్యాక్టరీ నుంచి పెద్దమొత్తంలో 'డస్ట్‌ స్ప్రెడ్‌'

- August 31, 2017 , by Maagulf
రస్‌ అల్‌ఖైమాలోని ఫ్యాక్టరీ నుంచి పెద్దమొత్తంలో 'డస్ట్‌ స్ప్రెడ్‌'

యూఏఈ మినిస్ట్రీ ఆఫ్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌, రస్‌ అల్‌ ఖైమాలోని ఓ సిమెంట్‌ ఫ్యాక్టరీ ఆపరేషన్స్‌ని సస్పెండ్‌ చేసినట్లు వెల్లడించింది. ఈ ప్రాంతమంతటా విపరీతమైన డస్ట్‌ ఏర్పడిందనీ, దానికి కంపెనీ ప్రమాణాలు పాటించకపోవడమే కారణమని పేర్కొంది. సోషల్‌ మీడియాలో ఈ మేరకు ఓ ప్రకటన చేసింది మినిస్ట్రీ. సాంకేతిక పరమైన సమస్య కారణంగా యూనియన్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ పెద్దమొత్తంలో డస్ట్‌ని స్ప్రెడ్‌ చేసిందని పేర్కొన్నారు. ఉన్నపళంగా తగిన భద్రతా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ సంస్థకు తగిన ఆదేశాలు జారీ అయ్యాయి. ఓవెన్‌లో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా ఈ ఘటన చోటుచేసుకుందని ఎన్విరాన్‌మెంటల్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ - రస్‌ అల్‌ ఖైమా - డాక్టర్‌ సైఫ్‌ మొహమ్మద్‌ అల్‌ ఘాయిస్‌ పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com