హజ్ క్రౌడ్ కంట్రోల్ ప్లాన్ రివ్యూ
- August 31, 2017
డిప్యూటీ ఇంటీరియర్ మినిస్ట్రీ ఫర్ ఆపరేషన్ ఎఫైర్స్ మరియు జనరల్ సూపర్వైజర్ ఆఫ్ పబ్లిక్ సెక్యూరిటీ లెఫ్టినెంట్ జనరల్ సయీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖాహ్తాని, హెడ్‌క్వార్టర్స్‌ని సందర్శించి అక్కడి సెక్యూరిటీ ఫోర్సెస్‌తో సమావేశమయ్యారు. క్రౌడ్ కంట్రోల్ ప్లాన్‌పై అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారాయన. కమాండర్ ఆఫ్ హజ్ సెక్యూరిటీ ఫోర్సెస్ లెఫ్టినెంట్ జనరల్ ఖాలిద్ అల్ హబ్రి వెల్లడించిన వివరాల ప్రకారం, ఫోర్సెస్ మినాలోని స్టేషన్ నిర్వహించిన డ్రిల్‌ని పరిశీలించినట్లు చెప్పారు. రైల్వే స్టేషన్లలోకి వచ్చే యాత్రీకులకు ఎలాంటి ఇబ్బందీ కలుగరాదనీ, ముందస్తుగా ఆయా అంశాలపై మాక్ డ్రిల్స్ నిర్వహించి, వాటి ఫలితాలను విశ్లేషించి తగిన చర్యలు చేపట్టాలని అధికారుల్ని అబ్దుల్లా అల్ ఖహ్తాని సూచించారు. పర్యటన సందర్భంగా, సిబ్బంది చేపడ్తున్న చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారాయన. మరింత మెరుగైన సేవలు అందించే క్రమంలో ఎక్కడా అలసత్వం వహించరాదని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక







