'హైడ్ అండ్ సీక్' బీచ్ ఒడిశా లోని చండిపుర లో
- September 01, 2017
పగలు సముద్రంలో ఉండి.. రాత్రుళ్లు కనిపించే శివాలయం, ఉదయం కనిపించి సాయంత్రం సముద్రంలోకి వెళ్ళే దేవాలయం.. ఇలా అనేక వింతలు.. విశేషాలు.. మన దేశంలో కో కొల్లలు.. అంతేకాదు.. రంగుల రంగుల ఇసుక కలిగిన బీచ్ గురించి కూడా మనం విన్నాం.. తాజాగా.. రోజు కి రెండు సార్లు కనిపించకుండా మాయం అయ్యే బీచ్ ఒకటి ఉన్నది.. అదీ మనదేశంలో ఉన్నది.. ఆ బీచ్ ఎక్కడో కాదు.. ఒడిషా లోని చండిపుర సముద్ర తీరంలో ఉన్నది. ఈ సముద్ర తీరాన్ని 'హైడ్ అండ్ సీక్' అని కూడా పిలుస్తారు. ఎత్తైన అలలతో పాటు.. అతి తక్కువ ఎత్తులో ఉండే అలలను మనం ఈ తీరంలో చూడవచ్చు. ఈ విచిత్ర దృశ్యం చూడడానికి దేశ విదేశాల నుంచి పర్యాటకులు నిత్యం పోటెత్తుతారు. వివరాల్లోకి వెళ్తే...
ఒడిషాలోని భువనేశ్వర్ నుంచి జాతీయ రహదారి 5 మీదుగా సుమారు 200 కి.మీ. దూరంలో బలసూర్ జిల్లా ఉంది. రైల్వే స్టేషన్ నుంచి 16 కి.మీ. దూరంలో సముద్ర తీరం ఉంది.. అలల వ్యత్యాసం వల్ల చండీపురం లోని సముద్ర తీరంలో ప్రసిద్ధి పొందిన అద్భుతాన్ని చూసేందుకు అనేక మంది పర్యాటకులు వస్తుంటారు. ప్రపంచంలో మాయమయ్యే ఏకైక బీచ్ ఇదే..! పూరి, కోణార్క్ దేవాలయాలను చూడడానికి వచ్చిన పర్యటకులు, ఈ ప్రాంతాన్ని చూడడానికి తప్పని సరిగా వస్తారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







