తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఛార్మి
- September 01, 2017
సుమారు 50 సినిమాలలో నటించడమే కాకుండా టాప్ యంగ్ హీరోలలో చాలామందితో నటించిన ఛార్మీ ప్రస్తుతం నటిగా అవకాశాలు రాకపోవడంతో నిర్మాతగా మారి జ్యోతిలక్ష్మితో గతంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే ఆమెకు అక్కడ దురదృష్టం వెంటాడటంతో ప్రస్తుతం పూరి క్రియేటివ్ టీమ్ లో పనిచేస్తూ 'పైసా వసూల్' చిత్ర నిర్మాణంలో అన్నీ తానై నిర్వహించింది.
ఈరోజు విడుదలైన 'పైసా వసూల్' సినిమా గురించి ఆమె ట్విట్ చేస్తూ మన కేంద్ర ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన 200 రూపాయలను చేతిలో పుచ్చుకుని కెమేరాకు పోజు ఇస్తూ 'పైసా వసూల్' బిగిన్స్ అంటూ కామెంట్ పెట్టింది. కొత్త నోట్ల రిలీజ్ కు బాలయ్య కొత్త సినిమా రిలీజ్ కు లింక్ పెడుతూ ఛార్మీ పెట్టిన ఈ పోస్ట్ బాలకృష్ణ అభిమానులను బాగానే ఆకట్టుకుంటోంది.
ఇక్కడి నుంచి వసూళ్లు లెక్క పెట్టుకోవడమే అంటూ కొందరు బాలయ్య అభిమానులు ఆమెకు అభినందనలు కూడ తెలియచేసారు. అయితే మన తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే బయటకు వస్తున్న ఈసినిమా టాక్ బాలకృష్ణ అభిమానులు ఆ సించిన స్థాయిలో లేదు అనే వార్తలు వస్తున్నాయి.
ముఖ్యంగా పూరి జగన్నాథ్ ఈసినిమా ట్రైలర్ విషయంలో అదేవిధంగా ఈమూవీ పబ్లిసిటీ విషయంలో చేసిన స్థాయిలో ఈమూవీ లేదు అన్న మాటలను లోలోపల బాలయ్య అభిమానులే అంగీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈమూవీకి వచ్చిన ప్రాధమిక టాక్ బట్టి చూస్తూ ఉంటే ఈసినిమా విషయంలో బాలకృష్ణ పెట్టుకున్న అంచనాలు కొంతవరకు దెబ్బ తిన్నట్లే అని అనిపిస్తోంది.
ఒకవైపు యూత్ అంతా 'అర్జున్ రెడ్డి' మ్యానియాలో కొట్టుకుపోతున్న నేపధ్యంలో కేవలం బాలయ్య అభిమానుల అండతో ఈమూవీ రికార్డులు క్రియేట్ చేయడం కష్టం అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







