వివాదాలలో చిక్కుకుంటున్న సంగీత డైరెక్టర్ కీరవాణి
- September 02, 2017
గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతాన్ని అందించిన కీరవాణిని టార్గెట్ చేస్తూ జరుగుతున్న వివాదం సోషల్ మీడియాకు హాట్ న్యూస్ గా మారింది. తెలుగు సాహిత్య విలువలు పడిపోవడం గురించి 'బాహుబలి ది కంక్లూజన్' విడుదలకు ముందు ఈసంగీత దర్శకుడు చేసిన సంచలన వ్యాఖ్యలు అప్పట్లో ఎంత వివాదానికి దారి తీసాయో తెలిసిన విషయమే.
ఆ వ్యాఖ్యల పై పెను దుమారం లేపింది. అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యల పై ఇండస్ట్రీ జనాల నుంచి కూడ ప్రతిఘటన ఎదుర్కొన వలిసి వచ్చింది. ఇలాంటి పరిస్థితులలో ఈ విలక్షణ సంగీత దర్శకుడు మరో వివాదంలో చిక్కుకున్నాడు.
నిన్న విడుదల అయిన నందమూరి బాలకృష్ణ 'పైసా వసూల్' ఫస్ట్ డే ఫస్ట్ షో సందర్భంగా థియేటర్లో బాలయ్య అభిమానుల కోలాహలం చూసిన కీరవాణి ఉత్సాహంలో ఆ తర్వాత ఒక ట్వీట్ చేశారు. జైహింద్ అనేటపుడు ఎంత ఎమోషన్ ఉంటుంటో 'జై బాలయ్యా' అనడంలోనూ అంతే ఎమోషన్ కనిపిస్తోందన్నట్లుగా ఆయన ట్వీట్ చేశారు.
దీనిపై సామాజిక మాధ్యమాల్లో పెను దుమారమే రేగింది. 'జైహింద్' నినాదంతో 'జై బాలయ్య' స్లోగన్ ను ఎలా పోలుస్తారంటూ కీరవాణిని కొందరు టార్గెట్ చేస్తూ ఘాటైన కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు ఇదేం దేశభక్తి అంటూ కీరవాణిని ప్రశ్నిస్తున్నారు. దీనికితోడు కీరవాణికి ఈవిషయంలో కులం మురికి అంటించే ప్రయత్నం చేస్తున్నారు మరికొందరు.
ఈ విమర్శలపై కీరవాణి ధీటుగా సమాధానం ఇచ్చాడు. తన దేశభక్తిని ఎవరూ శంకించలేరని ఫేక్ డీపీలు పెట్టుకునే కుక్కలు తన దేశభక్తి గురించి మాట్లాడటం విడ్డురంగా ఉందని అంటూ తాను గత ఎన్నికల్లో ఓటేశానని మరి తనను ప్రశ్నించే వ్యక్తులు అసలు వోట్ వేశారా? అంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు. తాను 'అర్జున్ రెడ్డి' సినిమాను ఆ సినిమా యూనిట్ ను ప్రశంసిస్తూ కామెంట్స్ చేసిన నేపధ్యాన్ని గుర్తుకు చేస్తూ 'అర్జున్ రెడ్డి' సినిమా హీరో మరియు దర్శకుడు తన సామాజిక వర్గ వ్యక్తులా అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నాడు కీరవాణి. ఏమైనా కీరవాణి యధాలాపంగా అన్న కామెంట్స్ అతడికి పెద్ద సమస్యనే తెచ్చి పెట్టాయి..
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







