హజ్‌ సీజన్‌: ప్రసవించిన 9మంది యాత్రీకులు

- September 02, 2017 , by Maagulf
హజ్‌ సీజన్‌: ప్రసవించిన 9మంది యాత్రీకులు

హజ్‌ సందర్భంగా 9 మంది మహిళా యాత్రీకులు ప్రసవించినట్లు డైరెక్టర్‌ ఆఫ్‌ మెటర్నిటీ అండ్‌ చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ - మక్కా డాక్టర్‌ అనాస్‌ సాదాయో చెప్పారు. అన్ని సౌకర్యాలూ కలిగిన తమ ఆసుపత్రిలో కొత్త అతిథులకు స్వాగతం పలకడం ఆనందంగా ఉందని చెప్పారాయన. వివిధ దేశాలకు చెందిన మహిళలు మొత్తం 9 మంది తమ ఆసుపత్రిలో ప్రసవించారనీ, వారికి తగిన వైద్య సహాయం అందించగలిగామని చెప్పారు. ఒంటరిగా వచ్చి, తన చిన్నారితో తిరిగి వెళ్ళనున్నందుకు ఆనందంగా ఉందని అల్జీరియాకి చెందిన ఓ మహిళా యాత్రీకులు పేర్కొన్నారు. అరాఫత్‌లో యెమనీ మహిళ ఒకరు చిన్నారికి జన్మనిచ్చారు. ఆమెకు మగబిడ్డ జన్మించాడు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com