కొత్త రూల్స్‌: ట్రాఫిక్‌ ఉల్లంఘనల తగ్గుముఖం

- September 02, 2017 , by Maagulf
కొత్త రూల్స్‌: ట్రాఫిక్‌ ఉల్లంఘనల తగ్గుముఖం

అబుదాబీ ఎమిరేట్‌లో సీట్‌ బెల్ట్‌ ఉల్లంఘనలు తగ్గుముఖం పట్టాయి. జులై 1 నుంచి ఆగస్ట్‌ చివరి వరకు మొత్తం 7,592 ఉల్లంఘనలు నమోదయ్యాయి. గత ఏడాది వీటి సంఖ్య 11,991గా ఉంది. ఫెడరల్‌ ట్రాఫిక్‌ చట్టానికి సంబంధించి నిబంధనల్లో కొన్నింటిని అమెండ్‌ చేసి, కొత్త రూల్స్‌ని తీసుకువచ్చారు. జులై 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. వాహనదారుల భద్రత కోసం తీసుకొచ్చిన ఈ నిబంధనలు బాగా పనిచేస్తున్నాయని లెఫ్టినెంట్‌ కల్నల్‌ సలాహ్‌ అల్‌ హుమైరి (డిప్యూటీ డైరెక్టర్‌ - అబుదాబీ ట్రాఫిక్‌ డిపార్ట్‌మెంట్‌) చెప్పారు. వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ లెక్కల ప్రకారం సీట్‌ బెల్ట్‌ కారణంగా ముందు సీట్లలోని 40 నుంచి 50 శాతం మందికి సంపూర్ణ రక్షణ ఉంటుందనీ, వెనుక సీట్లలో 25 నుంచి 75 శాతం భద్రత ఉంటుందని చెప్పారాయన. కొత్త నిబంధనల ప్రకారం సీట్‌ బెల్ట్‌ ధరించని పక్షంలో నాలుగు బ్లాక్‌ పాయింట్స్‌తోపాటు 400 అరబ్‌ ఎమిరేట్‌ దినార్స్‌ జరీమానా విధిస్తున్నారు. కొత్త చట్టం ప్రకారం 4 ఏళ్ళలోపు చిన్నారులు ఖచ్చితంగా వెనుక సీట్లలోనే కూర్చోవాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com