వ్యాపిస్తున్న 'లాకీ ర్యాన్సమ్‌వేర్'..తస్మాత్ జాగ్రత్త..!
- September 02, 2017
కొత్తగా వ్యాపిస్తున్న మాల్‌వేర్ 'లాకీ ర్యాన్సమ్‌వేర్'తో జాగ్రత్తగా ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. లాకీ ర్యాన్సమ్‌వేర్‌పై జాగ్రత్తగా ఉండాలంటూ కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ అదనపు కార్యదర్శి అజయ్‌కుమార్ ట్వీట్ చేశారు. హానికారక సాఫ్ట్‌వేరైన ర్యాన్సమ్‌వేర్ కంప్యూటర్లను స్తంభింపజేసి(లాక్).. తిరిగి తెరుచుకునేందుకు ప్రతిఫలంగా సగం బిట్‌కాయిన్ (రూ.1.5 లక్షలు)ను డిమాండు చేస్తున్నట్లు తెలుస్తోంది. లాకీ ర్యాన్సమ్‌వేర్‌లో పలు రకాల్ని వ్యాప్తి చేసేందుకు ఒకే తరహా 'సబ్జెక్ట్'లతో కొత్త రకం స్పామ్ మెయిళ్లు వ్యాప్తి చెందుతున్నట్లు హెచ్చరించారు. వీటికి 'ప్లీజ్ ప్రింట్', 'డాక్యుమెంట్స్', 'ఫొటో', 'ఇమేజస్', 'స్కాన్స్', 'పిక్చర్స్' వంటి సర్వసాధారణ సబ్జెక్టు పేర్లుంటాయని వివరించారు. లాకీర్యాన్సమ్‌వేర్ కోసం లక్ష్యంగా మార్చుకునేందుకు నకిలీ వెబ్‌సైట్ల లింకుల్ని చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో బాగంగా 2.3 కోట్లకుపైగా సందేశాలు పంపినట్లు తెలిపారు. ఈమెయిల్స్ తెరిచేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలనీ, వాణిజ్య సంస్థలు స్పామ్ నిరోధకాల్ని ఏర్పాటు చేయాలనీ, స్పామ్‌గా గుర్తించిన జాబితాను నవీకరించాలని కేంద్రం తన హెచ్చరికలో సూచించింది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









