బహ్రెయిన్ బే రహదారిలో భయానక కారు ప్రమాదం ఓ వ్యక్తి మృతి

- September 02, 2017 , by Maagulf
బహ్రెయిన్ బే రహదారిలో భయానక కారు ప్రమాదం ఓ వ్యక్తి మృతి

మనామా: దక్షిణ గవర్నైట్ పరిధిలో  బహ్రెయిన్ బే రోడ్డుపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఓ  రోడ్డు ప్రమాదంలో బహ్రెయిన్  వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటనలో  మరణించిన వ్యక్తిని  మహ్మద్ హబీబ్ గా ధృవీకరించారు. తన స్పోర్ట్స్ కారుని వేగంగా నడుపుతూ దానిపై  నియంత్రణను కోల్పోయి హబీబ్ రోడ్డు పక్కన ఉన్న ఒక పామ్ చెట్టుని బలంగా డీ కొట్టినప్పుడు ఆ ప్రమాదం జరిగింది. సివిల్ డిఫెన్స్ అగ్నిమాపక ప్రమాదంలో సన్నివేశం చేరుకునే వరకు బాధితుడు కారు లోపల చిక్కుకున్నట్లు సమాచారం . ఈ ప్రమాదంలో క్షతగాత్రుడికి  తీవ్ర గాయాలయ్యాయి.ప్రమాద స్థలంలోనే ఆయన మరణించినట్లు అంతర్గత వ్యవహారాల శాఖ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ సంఘటనను ధృవీకరించింది, "బహ్రెయిన్ బే రోడ్డుపై తన కారు నియంత్రణను కోల్పోయిన నేపథ్యంలో వేగంగా ప్రయాణిస్తూ మరణించాడు. తన స్వస్థలమైన, ఉత్తర గవర్నైట్లోని సదాద్ గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం అంతిమ సంస్కారం నిర్వహించబడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com