గ్రీన్‌కార్డు పై అమెరికా ఇమ్మిగ్రేషన్‌ శాఖ సంచలన నిర్ణయం.!

- September 02, 2017 , by Maagulf
గ్రీన్‌కార్డు పై అమెరికా ఇమ్మిగ్రేషన్‌ శాఖ సంచలన నిర్ణయం.!

హెచ్‌-1బీ వీసా మీద అమెరికాలో ఉంటున్న భారతీయులకు గ్రీన్‌కార్డు దక్కించుకోవడం మరింత కష్టతరం కానుంది. ఇకనుంచి అలాంటి వారు వ్యక్తిగతంగా ఇమ్మిగ్రేషన్‌ శాఖ ఇంటర్వ్యూకు హాజరై గట్టెక్కాల్సి ఉంటుంది. ఆగస్టు 28న ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటిదాకా గ్రీన్‌కార్డు హోల్డర్ల కుటుంబ సభ్యులు గ్రీన్‌కార్డు కోరుకున్నపుడే ఇంటర్వ్య్చూలు చేస్తున్నారు. వాళ్లకు కూడా చాలాసార్లు ఇంటర్వ్యూల నుంచి మినహాయింపునిస్తున్నారు. హెచ్‌-1బీ హోల్డర్లకు 100 శాతం మినహాయింపునిచ్చేవాళ్లు. ఇక నుంచి ఇంటర్వ్యూ తప్పనిసరి చేశారు. అమెరికా గ్రీన్‌ కార్డు పొందే వాళ్లలో ఎక్కువ శాతం హెచ్‌-1బీ వీసాపై అక్కడ పని చేస్తున్న వాళ్లే ఉంటారు. 2010-2014 మధ్యలో రెండు లక్షల మంది హెచ్‌-1బీ వీసా హోల్డర్లకు గ్రీన్‌కార్డులు లభించాయి. 2015లో 34,843 మంది భారతీయులు తాత్కాలిక నివాస వీసాల నుంచి గ్రీన్‌కార్డుకు మారారు.
అందులో 25,179 మంది హెచ్‌-1బీ వీసాలు కలిగిన వాళ్లే. ఎంట్రీ జాబ్‌లైన లెవల్‌-1 ఉద్యోగాలు ఎవరైనా చేయగలిగినవి కావడంతో అలాంటి ఉద్యోగాల విషయంలో వీసాలు తేలిగ్గా ఇవ్వకూడదని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు పట్టుదలగా ఉన్నారు. ఆ తర్వాత ఉద్యోగాలు ప్రత్యేక నైపుణ్యాలు కలిగినవి కావడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా వీసాలు ఇస్తున్నారు. శాన్‌జో్‌సలో ఏ అర్హతలు అవసరం లేని ఎంట్రీలెవల్‌ కనీస వేతనమే 88,733 డాలర్లు ఉంది. ఈ ఏడాది హెచ్‌-1బీ వీసాలకోసం అత్యధికంగా 2.47 లక్షల మంది భారతీయులు దరఖాస్తు చేసుకున్నారు.
ఇటీవలికాలంలో హెచ్‌-1బీ వీసాల విషయంలో ఉన్న సమాచారంతో సంతృప్తి చెందక ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అదనపు సమాచారం(ఆర్‌ఈఎఫ్‌) అడగడం కూడా ఎక్కువైంది. ఆర్‌ఈఎ్‌ఫలు 65 శాతం పెరిగాయి. అందులో ఎదురయ్యే ప్రధాన ప్రశ్న ప్రత్యేక నైపుణ్యం అవసరమయ్యే ఉద్యోగమేనా? అని. క్లిష్టమైన నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగం అయితే అది ఎంట్రీ లెవల్‌ ఉద్యోగం ఎలా అవుతుందని ప్రశ్నిస్తారు. ఇంటర్వ్యూల వల్ల అటు ప్రభుత్వానికి, ఇటు రిక్రూట్‌మెంట్‌ చేసుకుంటున్న కంపెనీలకు ఆర్థిక భారం పెరిగిపోతోంది. కానీ, వలసల నియంత్రణపై ట్రంప్‌ పట్టుదలతో ఉండటంతో అధికార యంత్రాంగం కష్టమైనా ఇంటర్వ్యూలకే కట్టుబడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com