సెప్టెంబర్ 15న రిలీజ్ కాబోతున్న ఓయెనిన్నె సినిమా
- September 04, 2017
భరత్ మార్గాని హీరోగా ఎస్.వి.కె. సినిమా పతాకంపై వంశీకృష్ణ శ్రీనివాస్ నిర్మించిన చిత్రం ‘ఓయ్.. నిన్నే’. సృష్టి హీరోయిన్. సత్య చల్లకోటి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ నేపద్యంలో చిత్ర నిర్మాత వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘పరశురామ్, చందూ మొండేటి, సుధీర్ వర్మ, కృష్ణచైతన్యల వద్ద మా దర్శకుడు సత్య చల్లకోటి దర్శకత్వ శాఖలో పని చేశాడు. అతనికిదే మొదటి చిత్రం అయినా అనుభవమున్న దర్శకుడిలా ‘ఓయ్.. నిన్నే’ను తీర్చిదిద్దాడు. తండ్రీకొడుకుల మధ్య అభిప్రాయభేదాలు, బావా మరదళ్ల మధ్య ప్రేమకథ చిత్రానికి హైలైట్. గతంలో మా సంస్థ నిర్మించిన ‘సోలో, నువ్వా నేనా, రారా కృష్ణయ్య’ తరహాలో చక్కటి కుటుంబ కథాచిత్రమిది. భరత్ మార్గాని, సృష్టిలు కొత్తవాళ్లైనా బాగా నటించారు’’ అన్నారు.
‘‘కుటుంబ కథా చిత్రమిది. ఇందులో హీరోది ముక్కుసూటి మనస్తత్వం. మనసులో మాటను ఎదుటివ్యక్తి మొహం మీదే చెప్పేస్తుంటాడు. అతనికది కొన్నిసార్లు ప్లస్ అయితే, ఇంకొన్నిసార్లు మైనస్ అవుతుంటుంది. అటువంటి మనస్తత్వం వల్ల తండ్రితో అతనికి ఎలాంటి అభిప్రాయభేదాలు వచ్చాయి? మరదలికి, అతనికి మధ్య ఎవరు అడ్డు వచ్చారు? అనేది చిత్రకథ. ‘బొమ్మరిల్లు’లా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. నాకిది మొదటి చిత్రమైనా మా నిర్మాత ఇచ్చిన మద్దతు మరువలేను’’ అని దర్శకుడు సత్య తెలిపారు.
తనికెళ్ల భరణి, నాగినీడు, రఘుబాబు, సత్య, ‘తాగుబోతు’ రమేష్, తులసి, ప్రగతి, ధనరాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సాయి శ్రీరామ్, సంగీతం: శేఖర్ చంద్ర, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి, ఫైట్స్: వెంకట్.
తాజా వార్తలు
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి







