ఆంటోనీ నటించిన ఇంద్రసేనా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చెయ్యబోతున్న మన మెగాస్టార్
- September 04, 2017
మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించి, సినిమా సక్సెస్‌లో కీలకపాత్ర పోషించిన మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోని హీరోగా, నిర్మాతగా నకిలీ, డా.సలీం, బిచ్చగాడు, భేతాళుడు, యెమన్ వంటి సూపర్‌హిట్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. బిచ్చగాడు సినిమా తెలుగులో సృష్టించిన సెన్సేషన్ అందరికీ విదితమే. డిఫరెంట్ సినిమాలను ప్రేక్షకులకు అందించడానికి అహర్నిశలు ప్రయత్నిస్తున్న హీరో, నిర్మాత విజయ్ ఆంటోని త్వరలోనే 'ఇంద్రసేన' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఆర్.స్టూడియోస్, విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ సంస్థలు నిర్మాణంలో విజయ్ ఆంటోని, డయానా చంపిక, మహిమ, జ్యువెల్ మేరీ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం 'ఇంద్రసేన'. జి.శ్రీనివాసన్ దర్శకుడు. రాధికా శరత్‌కుమార్, ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మాతలు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ఈ సెప్టెంబర్ 5న మెగాస్టార్ చిరంజీవి విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా...
చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ ...''విజయ్ ఆంటోనిగారి సినిమాలంటే తెలుగులో ఎంత క్రేజ్ ఉందో తెలుసు. ఆయన నటించిన బిచ్చగాడు సినిమా తెలుగులో రికార్డ్ కలెక్షన్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. విలక్షణమైన కథలు, క్యారెక్టరైజేషన్‌తో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న విజయ్ ఆంటోని ఇంద్రసేన అనే డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను సెప్టెంబ్ 5న మెగాస్టార్ చిరంజీవిగారు విడుదల చేస్తున్నారు. మా సినిమాకు సపోర్ట్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవిగారికి థాంక్స్. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నాం'' అన్నారు.
విజయ్ ఆంటోని, డయానా చంపిక, మహిమ, జ్యువెల్ మేరీ, రాధా రవి, కాళి వెంకట్, నళిని కాంత్, రింధు రవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సాహిత్యం: భాషా శ్రీ, కొరియోగ్రఫీ: కల్యాణ్, స్టంట్: రాజశేఖర్, ఆర్ట్: ఆనంద్ మణి, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్: విజయ్ ఆంటోని, సినిమాటోగ్రఫీ: కె.దిల్‌రాజు, లైన్ ప్రొడ్యూసర్: శాండ్రా జాన్సన్, నిర్మాతలు: రాధికా శరత్‌కుమార్, ఫాతిమా విజయ్ ఆంటోని, దర్శకత్వం: జి.శ్రీనివాసన్.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









