బెంగళూరులో భారీ వర్షాలు, రోడ్లు జలమయం
- September 04, 2017
బెంగళూరులో ఆదివారం రాత్రి భారీ వర్షాలు పడ్డాయి. పలు ప్రాంతాల్లో వర్షం నీరు ఇళ్లలోకి వెళ్లడంతో ప్రజలు జాగారం చేశారు. ఎడతెరిపిలేకుండా గత మూడు రోజుల నుంచి రాత్రి పూట బెంగళూరు నగరంలో కుండపోత వర్షం కురుస్తోంది.
బెంగళూరులోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సిల్క్ బోర్డు జంక్షలోని రోడ్లలో నాలుగు అడుగుల ఎత్తులో నీరు చేరుకోవడంతో వాహనచోదకులు, ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. గూరగుంటపాళ్య, కురబరహళ్ళి, బనశంకరి, కంగేరి, జయనగర, జేపీ నగర, టిన్ ఫ్యాక్టరీ, కేఆర్ పురం, హెబ్బాళ, యలహంక తదితర ప్రాంతాలు జలమయం అయ్యాయి.
పలు ప్రాంతాల్లో వర్షం నీరు డ్రైనేజ్ ల నుంచి రోడ్ల మీదకు రావడంతో నిర్లక్షంగా వ్యవహరిస్తున్న బీబీఎంపీ అధికారుల మీద ప్రజలు మండిపడుతున్నారు. పలు ప్రాంతాల్లో డ్రైనేజ్ పనులు జరుగుతున్నాయి. ఆ ప్రాంతాల్లో డ్రైనేజ్ లు పూర్తిగా మూసివేయడంతో వర్షం నీరు రోడ్ల మీద నిలిచిపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పలు వార్డుల్లో వర్షం నీరు రోడ్ల మీద నిలిచిపోయి ఇళ్లలోకి వస్తున్నాయి. పలు ప్రాంతాల్లో చెట్లు కుప్పకూలిపోవడంతో విద్యుత్ వైర్లు తెగిపోయి విద్యుత్ సరఫరా సోమవారం మద్యహ్నం వరకు నిలిచిపోయింది. నగరాభివృద్ది శాఖ మంత్రి కేజే. జార్జ్, బెంగళూరు మేయర్ పధ్మావతి నిర్లక్షం చేస్తున్నారని ఆరోపిస్తు వారి దిష్టిబొమ్మలు దహనం చేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







