చైనా లో భారత్ విజయం
- September 04, 2017
డోక్లాం ప్రతిష్టంభనపై దౌత్యపరంగా విజయం సాధించిన భారత్‌కు కొద్దిరోజుల్లోనే... అంతర్జాతీయ వేదికపై మరో భారీ విజయం లభించింది. పాకిస్తాన్ పేరెత్తకుండానే ప్రధాని మోదీ దాయాది దేశాన్ని అంతర్జాతీయ సమాజం ముందుకు ఈడ్చుకొచ్చారు. చైనా వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల డిక్లరేషన్‌లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలైన జైషే మహ్మద్, లష్కరే తొయిబా పేర్లను కూడా చేర్చారు. జైషే మహ్మద్ సంస్థ చీఫ్ మహ్మద్ సయీద్‌పై ఐరాస అంతర్జాతీయ ఉగ్రవాది ముద్ర పడకుండా కాపాడుతూ వస్తున్న చైనా... తాజాగా తన నిర్ణయం మార్చుకున్నట్టు కనిపిస్తోంది. జైషే మహ్మద్, లష్కరే మూకల కారణంగా పెచ్చరిల్లుతున్న హింసను చైనా ఖండించింది. ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆర్ధిక సాయం అందిస్తోందంటూ ఎంతోకాలంగా భారత్ చేస్తున్న ఆందోళనను చైనా పరిగణలోకి తీసుకుంది.
గతేడాది గోవాలో జరిగిన బ్రిక్స్ సమావేశాల సందర్భంగా పాకిస్తాన్‌పై భారత్ తీవ్రస్థాయిలో స్పందించిన సంగతి తెలిసిందే. ''ఉగ్రవాదానికి పుట్టిల్లు పాకిస్తాన్..'' అంటూ గోవా బ్రిక్స్ సమావేశాల్లో మోదీ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ సమాజంలో ప్రకంపనలు రేపాయి. తాజాగా చైనాలో జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల్లోనూ పాకిస్తాన్‌కు మొట్టికాయలు పడడం విశేషం. లష్కరే తొయిబా, జైషే మహ్మద్‌లతో పాటు తాలిబన్, ఐఎస్ఐఎల్, అల్ ఖయిదా, హక్కానీ తదితర ఉగ్రసంస్థల హింసపైనా బ్రిక్స్ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







