డేరా లో ఏం జరుగుతోంది?
- September 04, 2017
డేరా బాబా ఆశ్రమంలో చేసిన అరాచకాలు ఒక్కోక్కటిగా బయటపడుతున్నాయి. బాబా ఆశ్రమాల్లో తనిఖీలు చేస్తున్న పోలీసులు... అక్కడి సీన్లు చూసి షాకవుతున్నారు. సిర్సాలోని ఆశ్రమంలో ఇవాళ 33 తుపాకీలను సీజ్ చేశారు. వీటిలో పాయింట్ త్రీ వన్ ఫైవ్ బోర్ రైఫిల్స్, పిస్టల్స్, రివాల్వర్స్ ఉండడం కలకలం సృష్టిస్తోంది. ఆధ్యాత్మిక కేంద్రంలో ఇలా ఆయుధాలు భారీగా ఎందుకుంచారన్న దానిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. డేరా సచ్చా సౌధా పేరుతో 67 ఆయుధాలకు లైసెన్స్ ఇచ్చామంటున్నారు పోలీసులు. ఇంత పెద్ద మొత్తంలో లైసెన్సులు ఇవ్వాల్సిన అవసరం ఏమిటన్నదానిపై పోలీసులు పెదవి విప్పడం లేదు. మిగిలిన 34 ఆయుధాలను స్వాధీనం చేయమని డేరా నిర్వాహకులకు నోటీసు ఇచ్చామంటూ తప్పించుకుంటున్నారు సిర్సా పోలీసులు.
డేరా ఆశ్రమంలో ఇద్దరు సాధ్విలపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో 20 ఏళ్ల జైలు శిక్షకు గురైన రామ్ రహీమ్ సింగ్.. తన కోసం ప్రత్యేక సైన్యాన్ని సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. పంచ్కులలో కోర్టు తీర్పు వెల్లడైన తర్వాత అల్లర్లకు పాల్పడింది వీళ్లేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







