మోహన్ లాల్ కొడుకుగా ఎన్టీఆర్ సినిమా
- October 28, 2015
టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా నటిస్తున్న చాలా మంది రొటీన్ అయిపోవటంతో కొత్తవారి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు స్టార్ హీరోలు. ముఖ్యంగా సినిమాలో ప్రధానపాత్రల్లో కనిపించేవారు స్టార్ ఇమేజ్ ఉన్న నటులైతే కమర్షియల్ గా కూడా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. అందుకే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నెక్ట్స్ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఓ సూపర్ స్టార్ నటిస్తే బాగుంటుందని భావిస్తున్నాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'నాన్నకు ప్రేమతో' సినిమాలో నటిస్తున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో ఓ కీలక పాత్రను మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తో చేయించాలని భావిస్తున్నారు చిత్రయూనిట్. శివ గతంలో డైరెక్ట్ చేసిన రెండు సినిమాల్లోనూ ఈ తరహా పాత్రలను అద్భుతంగా చిత్రీకరించాడు. 'మిర్చి' సినిమాలో సత్యరాజ్ చేసిన పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తరువాత 'శ్రీమంతుడు' సినిమాలో జగపతిబాబును మహేష్ తండ్రిగా చూపించి మరోసారి మెప్పించాడు శివ. ఇప్పుడు తన మూడో సినిమాకు మోహన్ లాల్ కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇప్పటికే తెలుగులో సాయి కొరపాటి నిర్మిస్తున్న సినిమాకు ఓకే చెప్పిన మోహన్ లాల్, ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాకు అంగీకరిస్తాడో లేదో చూడాలి.
తాజా వార్తలు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..







