భారీ బందోబస్తు నడుమ గణనాధుని శోభాయాత్ర
- September 04, 2017
హుస్సేన్‌సాగర్ తీరం జనసంద్రంగా మారుతోంది. గణపతిబప్పా మోరియా.. అంటూ భక్తుల కేరింతలతో ట్యాంక్‌బండ్ పరిసరాలన్నీ సందడిగా మారాయి. బొజ్జ గణపయ్యను ఘనంగా సాగనంపే పర్వం ప్రారంభమైంది. ప్రతి ఏటా జరిగే నిమజ్జన ఘట్టమే అయినా సరికొత్తగా భక్తజనం తరలివస్తున్నారు. నగరం నలువైపుల నుంచి నిమజ్జనం కోసం హుస్సేన్‌సాగర్ తీరానికి వేలాది విగ్రహాలు ఊరేగింపుగా తరలి వస్తున్నాయి.
అటు ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర కాసేపట్లో ప్రారంభం అవుతుంది. నిమజ్జనం త్వరగా పూర్తి చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. మధ్యాహ్నం 2 గంటల లోపే ఈ భారీ విగ్రహాన్ని నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు చేశారు. రాత్రి 8 గంటలకు మహాకలశ పూజ తర్వాత కలశాన్ని కదిలించారు. తెల్లవారుజామున 3 గంటల కల్లా ట్రాలీ పైకి విగ్రహాలన్నీ చేర్చారు. కొద్దిసేపటి క్రితమే ప్రత్యేక పూజ అనంతరం గణనాథుడి శోభాయాత్ర ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటలకు హుస్సేన్ సాగర్ ఎన్టీఆర్ మార్గ్ లోని క్రేన్ నెంబర్ 4 దగ్గరికి చేరుకుంటుంది. మధ్యాహ్నం 2 గంటలలోపే నిమజ్జనం పూర్తి చేయాలని నిర్ణయించారు.
నగరంలో ప్రధాన ఊరేగింపు కేశవగిరి నుంచి ప్రారంభమైంది.సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చే విగ్రహాలు.. ఆర్పీరోడ్- ఎంజీరోడ్- కర్బలా మైదానం- కవాడిగూడ- ముషీరాబాద్ క్రాస్ రోడ్డు- ఆర్టీసీ క్రాస్ రోడ్డు- నారాయణగూడ క్రాస్‌రోడ్డు- హిమాయత్‌నగర్ వై జంక్షన్ మీదుగా లిబర్టీ వద్ద కలుస్తాయి. ఉప్పల్ వైపు నుంచి వచ్చే విగ్రహాలు - రామంతాపూర్- అంబర్‌పేట- ఓయూ ఎన్సీసీ - దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ ఆసుపత్రి మీదుగా ఆర్టీసీ క్రాస్‌రోడ్డుకు వచ్చి కలుస్తాయి. శోభాయాత్ర సాగే ప్రధాన మార్గం అంతా బారికేడ్లను ఏర్పాటు చేశారు. గణపతి విగ్రహాలు వచ్చే వాహనాలు తప్ప.. మరే వాహనాన్ని ఈ మార్గంలో అనుమతించరు. ఒక్క బషీర్ బాగ్ వద్దే.. వాహనాలు అటూ ఇటూ వెళ్లడానికి అనుమతి ఉంటుంది.
ఇక పోలీసు శాఖ 26 వేల మంది పోలీసులతో గట్టి బందోబస్తు చేపడుతోంది. వినాయక నిమజ్జన శోభా యాత్ర గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 354 కిలోమీటర్ల మేర సాగనుంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ట్యాంక్ బండ్ సహా 25 చెరువుల్లో నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. చెరువుల దగ్గర 166 క్రేన్లను సిద్ధం చేశారు. హుస్సేన్‌సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనం సాఫీగా సాగటానికి 38 భారీ క్రేన్లను రెడీగా ఉంచారు.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







