చిరు చిత్రానికి బాలీవుడ్ డిసైనర్
- September 04, 2017
మెగాస్టార్ చిరంజీవి చేయబోతున్న 151 మూవీ సెట్స్ ఫై ఉండగానే అంచనాలను పెంచేస్తుంది. ఇప్పటివరకు తెలుగు లో తెరకెక్కని విధంగా ఈ సినిమాను నిర్మించాలని నిర్మాత రామ్ చరణ్ ప్లాన్ చేస్తున్నాడు. భారీ కాస్ట్ & క్రూ ను దించుతున్నాడు. స్వాతంత్ర్యానికి ముందు ఉన్న వాతావరణాన్ని కళ్ళకు కట్టేలా చూపడం కోసం చిత్ర యూనిట్ కష్టపడుతున్నారు.
ఇందులో భాగంగానే చిరంజీవికి అప్పటి కాలం నాటి కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం కోసం బాలీవుడ్ డిజైనర్ అంజు మోడీని రంగంలోకి దింపారు చిత్ర యూనిట్. గతం లో ఈమె 'రామ్ లీల, బాజీరావ్ మస్తాని' వంటి హిట్ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం చిరంజీవి మీద లుక్ టెస్ట్ జరుగుతోందని త్వరలోనే సినిమాకు కావాల్సిన కాస్ట్యూమ్స్, ఆభరణాల డిజైన్లను రూపొందిస్తారని అంటున్నారు. స్వతహాగా డిజైనర్ అయిన, 'ఖైదీ నెం 150' కి పనిచేసిన చిరు కుమార్తె సుస్మిత కూడా ఆమెకు సహాయంగా ఉండనుంది. ఈ మూవీ లో నయనతార మెయిన్ హీరోయిన్ కాగా రెండో హీరోయిన్ గా ప్రగ్య ఛాన్స్ కొట్టిసినట్లు తెలుస్తుంది. సురేందర్ రెడ్డి ఈ మూవీ ని డైరెక్ట్ చేయనున్నాడు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







