గూగుల్ మరియు పేస్ బుక్ కు ఘాటుగా వార్ణింగ్ ఇచ్చిన సుప్రీమ్ కోర్ట్
- September 05, 2017
చైల్డ్ ఫోర్నోగ్రఫీ, రేప్, గ్యాంగ్‌రేప్ వీడియోల అప్‌లోడింగ్‌కు సంబంధించిన ఫిర్యాదుల వివరాలపై సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. ఈ ఫిర్యాదులకు సంబంధించిన వివరాలను సమర్పించాలని ఇంటర్నెట్ దిగ్గజాలు, గూగుల్, యాహూ, సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్, మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్‌లకు సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది.
గత ఏడాది నుంచి ఈ ఏడాది ఆగస్టు 31వరకు అందుకున్న ఫిర్యాదుల వివరాలు, ఫిర్యాదులపై తీసుకున్న చర్యలకు సంబంధించిన వివరాలను తమకు తెలపాల్సిందిగా సుప్రీం కోర్టు కోరింది. హైదరాబాద్‌కు చెందిన ఎన్జీఓ ప్రజ్వల అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తుకు లేఖ రాస్తూ రెండు రేప్ వీడియోలు ఉన్న పెన్ డ్రైవ్‌ను పంపించింది. దీనిని విచారణకు చేపట్టిన కోర్టు వాట్సాప్‌లో ఆ వీడియోలు అప్లోడ్ చేసిన వారిని గుర్తించాల్సిందిగా సీబీఐని ఆదేశించింది.
సోషల్ సైట్లలో అభ్యంతరకర వీడియోలను బ్లాక్ చేయడానికి ఉన్న సాంకేతిక పరిష్కారాలను పరిశీలించేందుకు ఏర్పాటైన కేంద్ర, ఇంటర్నెట్ సంస్థల ప్రతినిధులతో కూడిన కమిటీ సోమవారం జరిగిన ఈ కేసు విచారణకు హాజరైంది. పబ్లిక్ డొమైన్ వివరాలు ఇచ్చేందుకు ఆయా సైట్ల యాజమాన్యాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై స్పందించిన కోర్టు సంబంధిత వివరాలు ఇవ్వాల్సిందేనని ఇంటర్నెట్ దిగ్గజాలకు ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్‌కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









