రెండు లక్షల మంది పుణ్యస్నానాలకు వస్తారని అంచనా
- September 05, 2017
మన దేశంలోని ప్రధాన పుణ్యనదుల్లో ఒకటి కావేరి. ఈ పవిత్ర నదికి పుష్కరాలు వచ్చాయి. ఈ నెల 12న ప్రారంభమై 23వ తేదీ వరకు కొనసాగనున్నాయి. పుష్కరాలను గణపతి సచ్చిదానందస్వామి ప్రారంభించనున్నారు. ఈ పుష్కరాల గురించి మరచిపోయిన కర్నాటక సర్కారు చాలా ఆలస్యంగా మేల్కొంది. ఆగమేఘాల మీద పుష్కరఘాట్ల నిర్మాణానికి ఆదేశించింది. పుణ్యస్నానాల కోసం లక్షలాది మంది తరలిరానుండడంతో భారీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను పురమాయించింది. శ్రీరంగపట్టణ సమీపంలో దాదాపు రెండు లక్షల మంది పుణ్యస్నానాలకు వస్తారని అంచనా వేసింది. అందుకే అక్కడి స్నాన ఘట్టాలకు మరమ్మతులు చేపట్టారు. మరోవైపు గోదావరి, కృష్ణా పుష్కరాలకు లభించినంత ప్రచారం కావేరి పుష్కరాలకు లభించడం లేదు. దీంతో భక్తుల సంఖ్య ఎక్కువ ఉండకపోవచ్చని భావిస్తున్నారు. గురువు తులా రాశిలోకి మారడంతో కావేరి పుష్కరాలు 144 ఏళ్లకు ఒకసారి మహాపుష్కరాల్లో స్నానం చేస్తే గంగలో వెయ్యిసార్లు స్నానం చేసినట్లు.
గోదావరి, కృష్ణా పుష్కరాలు గత రెండేళ్లలో ముగిశాయి. ఇప్పుడు కావేరి నదికి పుష్కరాలు వచ్చాయి. గురువు కన్యా రాశి నుంచి తులా రాశికిలోకి మారనున్నాడు. ఏకంగా 144 ఏళ్లకు ఒకసారి మాత్రమే ఈ అరుదైన మహాపుష్కరాలు వస్తాయి. గురువు తులా రాశిలో ఉన్నప్పుడు ఒకసారి స్నానం చేస్తే వెయ్యిసార్లు గంగలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుందనేది భక్తుల విశ్వాసం. అందుకే ఈ మహాపుష్కరాల్లో పుణ్యస్నానాలు చేయడానికి లక్షలాది మంది ఎదురుచూస్తున్నారు.
కావేరి పుష్కరాలకు వెళ్లే భక్తుల కోసం కర్నాటక ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. శ్రీరంగపట్టణలోని ఘాట్లలో పుష్కర స్నానాలు చేయాలనుకునే భక్తులు బెంగళూరు నుంచి వెళ్లేందుకు ప్రత్యేక బస్సు, రైలు సదుపాయాలను కల్పిస్తున్నారు. ఈ నెల 17న ప్రత్యేక మేళాను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో లక్షమంది భక్తులు పాల్గొంటారని భావిస్తున్నారు. పుష్కరాలతోపాటు మేళాకు ఒక్క కర్నాటక నుంచేగాక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారని అంచనా.
పుష్కరాలకు రెడీ అవుతున్న కావేరికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. కర్నాటకలోని కొడగు జిల్లా బ్రహ్మగిరి పర్వత సానువుల్లో జన్మించే కావేరి నది 765 కిలోమీటర్ల మేర ప్రయాణం చేసి తమిళనాడులోని పూంపుహార్ వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. మార్గమధ్యంలో వివిధ ఉపనదుల్ని తనలో కలుపుకుని ముందుకు సాగుతుంది. ఈ ప్రయాణంలో లక్షలాది ఎకరాల్ని సస్యశ్యామలం చేస్తుంది. జనం దాహార్తిని తీరుస్తుంది. ప్రఖ్యాత శివనసముద్రం జలపాతం ఈ నది వల్లనే ఏర్పడింది. ఇక ఆసియా ఖండంలో తొలి జలవిద్యుత్తు కేంద్రం కూడా ఈ నదిపైనే నిర్మించారు.
తాజా వార్తలు
- కువైట్‌కు ఇండిగో విమాన సర్వీసులు జూన్ 4, 2026 వరకు నిలిపివేత
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్‌కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్‌లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్‌సన్‌ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం









