బెంగళూరులో సీనియర్ జర్నలిస్ట్ దారుణ హత్య
- September 05, 2017
బెంగళూరు: ప్రముఖ మహిళా జర్నలిస్టు గౌరీ లంకేశ్ దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు మంగళవారం రాత్రి ఆమెను కాల్చి చంపారు.
బెంగళూరు సిటీ రాజరాజేశ్వరి నగర్లో గౌరీ నివసిస్తున్నారు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో లోపలికి చొరబడ్డ దుండగులు తుపాకితో ఆమెపై కాల్పులు జరిపి పారిపోయారు. రక్తపు మడుగులో పడిపోయిన గౌరీని చుట్టుపక్కలవారు ఆస్పత్రికి తరలించేలోపే ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది.
గౌరీ లంకేశ్ హత్యపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది దురదృష్టకరమని, దేశంలో మారుతున్న పరిస్థితులకు ప్రమాద ఘంటిక అని, దోషులను కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







