సినీ నటుడు కమల్‌తో నగ్మా భేటీ, రాజకీయాలపై చర్చ
- September 05, 2017
మొన్నటి వరకు రజనీకాంత్. రాజకీయాల్లోకి వస్తాడంటూ, రాడంటూ ప్రచారం సాగింది. బీజేపీ గేలమేస్తోందని మరో ప్రచారం. ఇప్పుడు కమల్‌హాసన్ వంతు వచ్చింది. తాను ఎప్పుడో రాజకీయాల్లోకి వచ్చానంటూ ప్రకటించిన ఆయన్ని.. తమ వైపు తిప్పుకునేందుకు పార్టీల మధ్య పోటీ మొదలైనట్టు కనిపిస్తోంది.
తమిళ రాజకీయాల్లో సూపర్‌స్టార్ రజనీకాంత్ సైడైపోయాడు. ఇప్పుడంతా లోకనాయకుడు కమల్‌హాసన్ హవా నడుస్తోంది. తాను ఎప్పుడో రాజకీయాల్లోకి వచ్చేశానంటున్న విశ్వనటుడితో మాజీ హీరోయిన్, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నగ్మా భేటీ అయ్యారు. చెన్నై వెళ్లిన ఆమె.. కమల్ ఇంటికెళ్లి ఇంటసేపు ముచ్చటించడం హాట్ టాపిక్ అయింది.
కమల్ కొత్త పార్టీ పెడతాడా.. పాత పార్టీల్లోనే చేరతాడా అనేదానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. సొంత కుంపటి పెట్టుకునే అవకాశం లేదని విశ్లేషకుల అంచనా. దీంతో.. గ్లామర్ స్టార్ కోసం పార్టీలు పోటీ పడుతున్నాయి. తన రంగు కాషాయం కాదంటూ ఇప్పటికే ఆయన ప్రకటించాడు. అంటే.. బీజేపీలో చేరడు. ఇప్పటివరకు కమల్‌ని.. ప్రతి విషయంలో స్టాలిన్ వెనకేసుకొస్తున్నాడు. అయితే.. ఈయన మాత్రం కేరళ వెళ్లి కామ్రేడ్లను పొగడ్తలతో ముంచెత్తాడు. అంటే.. కరుణానిధి వారసుల విషయంలో అంత పాజిటివ్‌గా లేడనే వాదన వినిపించింది. పైగా డీఎంకే పంచన చేరితే.. తాను సైడ్ హీరో అయిపోతాడు. ఎందుకంటే.. ఆ పార్టీలో స్టాలినే హీరో. ఆధిపత్య పోరులో సొంత అన్ననే దూరం పెట్టారు. అందుకే.. ప్రత్యామ్నాయాలపై కమల్ దృష్టి సారించాడనే టాక్ ఉంది. దీంతో.. ఎందుకైనా మంచిదని కాంగ్రెస్ రంగంలోకి దిగింది. చర్చల కోసం నగ్మాను రాయబారిగా పంపినట్టు చెప్పుకుంటున్నారు. ఇద్దరి మధ్య రాజకీయాలపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. రజనీకాంత్ ప్రస్తావన కూడా వచ్చినట్టు తెలుస్తోంది. మరి, కమల్‌కు కాంగ్రెస్ ఇచ్చిన ఆఫరేంటి? లోకనాయకుడి రియాక్షన్ ఏంటి.. అన్నది తేలాల్సి ఉంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







