అమరవీరుల కుటుంబాలకు అండగా బాలీవుడ్ నటుడు 'అక్షయ్ కుమార్'
- September 05, 2017
దేవుడు మనకిచ్చిన ఈ అపూర్వమైన మనిషి జీవితానికి సార్థకత చేకూరేది కష్టాల్లో ఉన్న సాటి మనిషికి సాయం చేయగలిగినపుడే... ఎంత డబ్బున్నా సాయం చేసే మనసుండాలి... స్పందించే హృదయం ఉండాలి...దేశం కోసం, దేశ రక్షణ కోసం కట్టుకున్న భార్యని, కన్నబిడ్డల్ని వదిలి రాత్రింబవళ్లు దేశ సరిహద్దులో రెప్పవాల్చకుండా పహారా కాస్తుంటారు సైనికులు. మన కోసం అంత చేస్తున్న సైనికులకి మనం కూడా ఎంతో కొంత చేయగలిగితే.. అవకాశం ఉన్న అందర్నీ ఈ మంచి పనిలో భాగస్వామ్యం కావాలంటున్నారు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్. దేశం కోసం ప్రాణాలర్పించిన అమర వీరుల కుటుంబాలకు సాయం చేసేందుకు ముందుకు రమ్మని అక్షయ్ ఇచ్చిన పిలుపుకు అనూహ్య స్పందన లభించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన 'ఇండియా రైజింగ్' పేరుతో నిర్వహించిన ప్రపంచ ఇన్వెస్టర్ల సదస్సులో అక్షయ్ మాట్లాడారు. ఈ సదస్సులో పాల్గొన్న బడా వ్యాపార వేత్తలను ఉద్దేశించి మాట్లాడుతూ మీకు పుష్కలంగా పలుకుబడి, కావలసినంత సంపద ఉన్నాయి. అమర వీరుల కుటుంబాలను ఆదుకునేందుకు మీరు కాకుంటే ఎవరు ముందుకు వస్తారు అన్న అక్షయ్ మాటలకు బిజినెస్ మ్యాన్లంతా చలించి పోయారు.
ఇప్పటికే అమర వీరుల కుటుంబాలను ఆదుకునేందుకు అక్షయ్ కుమార్ సలహా మేరకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన www.bharatkeveer.gov.in వెబ్ సైట్ కు నిధులు రూ.15 లక్షలకు మించలేదు. ఈ వెబ్సైట్లో .. 112 మంది అమర వీరుల వివరాలున్నాయి. వీరంతా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు. ఒక్కో కార్పోరేట్ సంస్థ కానీ, సీఈవో కానీ కనీసం ఒక రాష్ట్రానికి చెందిన అమరవీరులను దత్తత చేసుకోవడానికి ముందుకొస్తే.. ఆ సైనికుల కుటుంబాలకు సరిపడా నిధులు వసూలవుతాయన్నారు అక్షయ్. జాబితాలో ఉన్న మహారాష్ట్రకు సంబంధించిన అమర వీరుల కుటుంబాల మొత్తానికి నేను విరాళ మిస్తానని అక్షయ్ కుమార్ అన్నారు. దీంతో కార్పోరేటర్స్ కూడా ముందుకొచ్చారు. విక్కి ఒబెరాయ్ ఆంధ్రప్రదేశ్‌ను ఎంపిక చేసుకున్నారు. నిమిషాల్లోనే దాదాపు రూ.6.5 కోట్లను సేకరించగలిగారు. వెబ్ సైట్లో ఉన్న 60%మందికి ఈ డబ్బులు సరిపోతాయన్నారు అక్షయ్ కుమార్.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









