మాడా వెంకటేశ్వరరావుకు తుది వీడ్కోలు
- October 28, 2015
అనారోగ్యంతో కన్నుమూసిన హాస్యనటుడు మాడా వెంకటేశ్వరరావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. రాయదుర్గంలోని మహాప్రస్థానంలో ఆయన నలుగురు కుమార్తెలు అంత్యక్రియలు నిర్వహించారు. వారం రోజుల కిందట అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఫిల్మ్‌నగర్‌లోని అపోలో ఆస్పత్రిలో మూడురోజుల క్రితం ఆయన మృతిచెందిన విషయం తెలిసిందే.విదేశాల్లో ఉన్న ఆయన కుటుంబసభ్యులు రాక ఆలస్యం కావడంతో భౌతికకాయాన్ని అపోలో ఆస్పత్రి శవాగారంలోనే భద్రపరిచారు. ఈరోజు ఉదయం కుటుంబసభ్యులు రావడంతో అపోలో ఆస్పత్రి నుంచి ఫిల్మ్‌నగర్‌లోని స్వగృహానికి తరలించారు. మాడా వెంకటేశ్వరరావుకు తుది వీడ్కోలు పలికేందుకు పలువురు సినీ ప్రముఖులు ఆయన నివాసానికి వచ్చి నివాళులర్పించారు. అక్కడి నుంచి అంతియ యాత్ర నిర్వహించి మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







