భాగ్యనగరంలో భారీ వర్షం

- September 06, 2017 , by Maagulf
భాగ్యనగరంలో భారీ వర్షం

 నగరంలో దట్టంగా మేఘాలు అలుముకున్నాయి. పగలే చీకటిగా మారడంతో వాహనదారుల ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ శివారులో పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలుచోట్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు భారీ వర్షం పడింది. ఎల్బీనగర్, హయత్‌నగర్‌, సరూర్‌నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌.. కొత్తపేట, చంపాపేట, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్; మోతీనగర్‌, బేగంపేట, బోరబండ, సనత్‌నగర్‌, మూసాపేటలో భారీ వర్షం కురిసింది. ఆఫీసులకు వెళ్లే సమయంలో వర్షం కురవడంతో ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com