లావ్ర్ అబుదాబీ ప్రారంభానికి సిద్ధం
- September 06, 2017
యూఏఈ: ఐకానిక్ లావ్ర్ అబుదాబీ మ్యూజియం, నవంబర్ 11న ప్రారంభం కానుందని అధికారులు వెల్లడించారు. సాదియాత్ ఐలాండ్‌లో ఈ మ్యూజియంను ఏర్పాటు చేశారు. అబుదాబీ టూరిజం మరియు కల్చర్ అథారిటీ ఛైర్మన్, ఛైర్మన్ ఆఫ్ ది టూరిజం డెవలప్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ మొహమ్మద్ ఖలీఫా అల్ ముబారక్ మాట్లాడుతూ, ఈ మ్యూజియం ఓ కొత్త ప్రపంచంలా ఉంటుందని చెప్పారు. 2007లో ఫ్రాన్స్, అబుదాబీ మధ్య కుదిరిన ఒప్పందం నేపథ్యంలో ఈ మ్యూజియం రూపుదిద్దుకుంది. 97,000 చదరపు మీటర్ల వైశాల్యంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ జీన్ నోవెల్ ఈ కాన్సెప్ట్‌ని డిజైన్ చేశారు. 8 లేయర్లతో 180 మీటర్ల వెడల్పుగల డోమ్ మొత్తం మ్యూజియంని కవర్ చేస్తుంది. ఆర్ట్ గ్యాలరీలతోపాటు, టెంపరరీ ఎగ్జిబిషన్ స్పేస్, చిల్డ్రన్స్ మ్యూజియం, 200 సీటర్ ఆడిటోరియం, రెస్టారెంట్, కేఫ్, రిటైల్ స్పేస్ కూడా ఇందులో ఉంటాయి. ఈ మ్యూజియంలోకి వెళ్ళాలంటే పెద్దలు 60 దిర్హామ్‌లు చెల్లించాల్సి ఉంటుంది. 13 ఏళ్ళలోపు పిల్లలకు ప్రవేశం ఉచితం. విద్యార్థులకు, ఆర్మ్డ్ ఫోర్సెస్, సీనియర్ సిటిజన్స్‌కి సంబంధించి ప్రత్యేకమైన ఆఫర్లు త్వరలో వెల్లడిస్తారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







