బహ్రైన్ లో రాయల్ లైఫ్ లైన్
- October 28, 2015
బహ్రైన్ అధినేత ఆదేశానుసారం ముహార్రక్ దేశంలోని ఎనిమిది ముఖ్యమైన అభివృద్ధి ప్రోజెక్టులు వేగవంతం కానున్నాయి. హిజ్ రాయల్ హైనెస్ ప్రధానమంత్రి ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా వారు నిన్న ముహార్రక్ ను సందర్శించి, పాత సెంట్రల్ మార్కెట్ ను ఖాళీ చేసి కొత్త సెంట్రల్ మార్కెట్ ను నిర్మించాల్సిందిగా ఆదేశించారు. ముహార్రక్ లో సేవలు మరియు రోడ్లు వ్యవస్థీకరణ చేసి, దుఖాణదారులు మరియు సందర్శకులకు అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. అధినేత మునిసిపల్ కౌన్సిలర్లు, ప్రభుత్వ అధికారులు మరియు సమాజ సేవకులతో జరిపిన ఒక సమావేశంలో హాలత్ బుమహేర్ కు కొత్త రూపు రేఖలను తీసుకు వచ్చి, దానిని ఒక నమూనా గా తీర్చిదిద్దాలని నిర్దేశించారు. ప్రజాపనులు, మునిసిపాలిటీ మరియు పట్టణ ప్రణాళికా వ్యవహారాల మంత్రిత్వశాఖను డాయిర్ మరియు సామాహీజ్ పట్టణాలలోని రహదారి వ్యవస్థలను మెరుగుపర్చాల్సిందిగా, బూసాటీన్ పబ్లిక్ బీచ్ వద్ద పనులను వేగవంతం చేయవలసిందిగా ఆదేశించారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







