ఈనెల 10న ఫ్యాన్స్‌తో చాటింగ్ కి డేట్ ఫిక్స్ చేసిన జూనియర్
- September 06, 2017
జూ.ఎన్టీఆర్ బిగ్గెస్ట్ ట్రీట్ కు డేట్ అండ్ టైం ఫిక్స్ అయ్యింది. తారక్ ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తోన్న ఈవెంట్ కు ప్రిపరేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. జైలవకుశ ట్రైలర్ లాంచ్ అండ్ ఫ్యాన్స్ మీట్ కు యంగ్ టైగర్ రెడీ అయిపోయాడు. ఈనెల 10న అభిమానులను కలుసుకోవడానికి వెన్యూ ఫిక్స్ చేసుకున్నాడు తారక్.
జైలవకుశ ఆడియోను సింపుల్ గా లాంచ్ చేసిన జూ.ఎన్టీఆర్ ఈనెల10న అభిమానులను మీట్ కావడానికి బిగ్గెస్ట్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నానని ఆడియో డే రోజే చెప్పాడు. తన మనసుకు నచ్చిన కథతో, అన్నాదమ్ముల అనుబంధంగా జైలవకుశ వస్తోందని, ఈసినిమా తనకు చాలా సంతృప్తినిచ్చిందంటూ, ఆ విషయాలన్నీ సెప్టెంబర్ 10న మాట్లాడుకుందాం అని తారక్ అండ్ గ్యాంగ్ ఆడియోడేన అనౌన్స్ చేశారు. దీంతో ఈ ఈవెంట్ కోసం అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
జూ.ఎన్టీఆర్ త్రిబుల్ రోల్ చేసిన జైలవకుశ ట్రైలర్ ను ఈనెల10 ఫ్యాన్స్ మీట్ లో రిలీజ్ చేస్తోంది టీం. హైదరాబాద్ శిల్పకళావేదికలో ఈనెల10న ఈ ఫ్యాన్స్ మీట్ కమ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి రెడీ అయ్యింది యూనిట్. 100కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈసినిమా రేంజ్ కు తగ్గట్లుగానే ఈవెంట్ ను లార్జ్ స్కేల్ లో నిర్వహించబోతోంది తారక్ టీం.
ఎన్టీఆర్ ఆర్ట్స్ లో బాబీ దర్శకత్వంలో యంగ్ టైగర్ జై,లవ,కుశలుగా మూడు విభిన్నమైన పాత్రలు చేస్తోన్న ఈసినిమా సెప్టెంబర్ 21న రిలీజ్ కాబోతోంది. రాశి ఖన్నా, నివిదా థామస్ హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. కళ్యాణ్ రామ్ నిర్మాణంలో తారక్ హీరోగా చేసిన ఫస్ట్ సినిమాపై నందమూరి బ్రదర్స్ తో పాటు, ఫ్యాన్స్ కూడా క్యూరియస్ గా ఉన్నారు. మరి ఈ అంచనాలతో జైలవకుశ ఏరేంజ్ లో వసూళ్లు సాధిస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







