యేసు మహిమలుతో రాబోతున్న తొలి కిరణం సినిమా
- September 06, 2017
యేసు మహిమలు
పి.డి. రాజు యేసుక్రీస్తుగా నటించిన సినిమా ‘తొలి కిరణం’. జాన్ బాబు దర్శకత్వంలో సువర్ణ క్రియేషన్స్ పతాకంపై టి. సుధాకర్ నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ పనులు పూర్తయ్యాయి. జాన్ బాబు మాట్లాడుతూ – ‘‘జీసస్ జీవితంలో ఇప్పటివరకూ చూపించని కథతో ఈ చిత్రాన్ని రూపొందించాం. సుమారు 5 కోట్లతో ఎక్కడా రాజీ పడకుండా తీశాం. తొలి కాపీ చూశా. అద్భుతంగా వచ్చింది. క్రీస్తు పాత్రలో పి.డి. రాజు జీవించాడు.
శిలువ వేసే సన్నివేశాలు చిత్రీకరించడానికి ముందు 40 రోజులు ఉపవాస దీక్ష చేశాడు. ఓ రోజు చర్చిలో ప్రార్థన చేస్తుంటే అతనికి ప్రభువు కనిపించాడు. అన్ని మతాలు, అన్ని వర్గాల వారు చూసేలా సినిమా ఉంటుంది. ప్రభువు మహిమలను ప్రతి ఒక్కరూ చూసి తరిస్తారని ఆశిస్తున్నాం. ఆర్పీ పట్నాయక్ స్వరపరిచిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. డిసెంబర్ 8న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం.’’ అన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







