దుబాయి రహదారి కూడళ్ల వద్ద 'యెల్లో బాక్స్' వద్ద ఆగితే 500 దిర్హాం ల జరిమానా
- October 28, 2015
దుబాయి రహదారి కూడళ్ల వద్ద 'యెల్లో బాక్స్' వద్ద ఆగితే 500 దిర్హాం ల జరిమానాట్రాఫిక్ జంక్షన్ల వద్ద యెల్లో బాక్స్ వద్ద ఆగటం వలన వచ్చే అనర్ధాలను నివారించడానికి దుబాయి పోలీసులు 'డు నాట్ స్టాప్ అట్ యెల్లో బాక్స్ జంక్షన్' అనే అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అక్టోబర్ 26 నుండి నవంబర్ 12 వరకు జరిగే ఈ కాంపైన్ లో భాగంగా టి. వి. ఛానెళ్లలో అవగాహనా కార్యక్రమాలు, దుబాయి పోలీసు వారు సోషల్ మీడియా ద్వారా సందేశాలు పంపనున్నారు. దుబాయి పోలీసు అవగాహనా శాఖ డైరక్టర్ కల్నల్ డా. జేసిమ్ ఖలీల్ మీర్జా, కొందరు డ్రైవర్లు ట్రాఫిక్ జాం ఉన్నప్పటికీ, ఈ బాక్స్ లోకి ప్రవేశించడం వలన ట్రాఫిక్ అడ్డంకులు ఏర్పడడంతోపాటు, మోటరు వాహన దారుల మధ్య వివాదాలు కూడా సంభవిస్తున్నాయని ఈ అనర్ధాలను నిరోధించడానికి 500 దిర్హాం ల జరిమాన విధించబడుతుందని తెలిపారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







