హైదరాబాద్ లో వెలిసిన అతిపెద్ద అమెజాన్ సెంటర్
- September 07, 2017
హైదరాబాద్: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్‌లో తన కార్యకలాపాలను భారీగా విస్తరిస్తోంది. భారతదేశపు అతిపెద్ద ఫుల్ఫిల్మెంట్ సెంటర్‌ను నేడు నగరంలో ప్రారంభించింది. 1.3 మిలియన్ చదరపు అడుగుల స్పేస్/1.6 కిలోమీటర్ల కన్వేయర్ బెల్ట్‌లో శంషాబాద్‌లో దీన్ని ఏర్పాటుచేసింది. అమెజాన్ నేడు లాంచ్ చేసిన ఈ సెంటర్‌పై రాష్ట్ర ఐటీ శాఖ, పరిశ్రమల శాఖా మంత్రి కే. తారకరామారావు ఆనందం వ్యక్తంచేశారు. నగరంలో దీన్ని ఏర్పాటుచేసినందుకు అభినందనలు తెలిపారు.
తెలంగాణలో ఈ ఫుల్ఫిల్మెంట్ ఏర్పాటుచేయడంతో, వేలమంది చిన్న, మధ్య తరహా వ్యాపారులు స్థానికంగా తయారుచేసిన ఉత్పత్తులను దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా విక్రయించుకునే వీలవుతుందన్నారు. ప్యాకేజింగ్, రవాణా, లాజిస్టిక్స్, హాస్పిటాలిటి వంటి సహాయక వ్యాపారాలు వృద్ది చెందుతాయన్నారు. ఈ సెంటర్ ద్వారా అమెజాన్ తన స్టోరేజ్ సామర్థ్యాన్ని 3.2 మిలియన్ క్యూబిట్ ఫీటుకు పెంచుకుంది. దీంతో వినియోగదారులకు త్వరితగతిన సరుకులను అందజేయనుంది. యువతకు వేలకొద్దీ ఉద్యోగవకాశాలను కూడా ఈ ఫుల్ఫిల్మెంట్ సెంటర్ సృష్టించనుందని అమెజాన్ ఇండియా, కస్టమర్ ఫుల్ఫిల్మెంట్ వైస్ ప్రెసిడెంట్ అఖిల్ సక్సేనా తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత







