సిరియాలో ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు..
- October 28, 2015
ఉగ్రవాదుల చేతిలో చిక్కిన సిరియా ప్రాంతాలను విముక్తి చేసేందుకు ఇరాన్ మరింత క్రియాశీలంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే ఆ దేశంలో ఆ దేశ బలగాలను మోహరించి ఉగ్రవాదుల పనిపడుతుండగా.. మరింత సైన్యాన్ని యుద్ధరంగంలోకి దించుతుంది. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్ మీద ఉన్న విశ్వాసం, నమ్మకంతోనే తాము వారికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నామని, అక్కడ ఉగ్రవాదాన్ని ఊడ్చిపారేసేందుకు సిరియాకు ఎన్నివిధాల సహాయమైనా చేస్తామని ఇరాన్ సైనికాధికారులు తెలిపారు. మరోపక్క, ఇరాన్ అందిస్తున్న సైనిక సహాయంపట్ల సిరియా కృతజ్ఞతలు తెలిపింది. నేరుగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో తలపడటంలోనూ, వ్యూహాత్మక దాడులను చేయడంలోనూ ఇరాన్ ఎంతో సహాయపడుతుందని అందుకు ధన్యవాదాలని కూడా తెలిపింది. ఆయుధాలను సమకూర్చడంలో, తక్షణమే స్పందించడంలో ఇరాన్ సహకారం మర్చిపోలేమన్నారు. సిరియాలో ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు ముందుకొచ్చిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







