నీళ్లు తాగితే ఆరోగ్యం
- October 28, 2015
ఈ ప్రపంచంలో మంచినీళ్లకు మించిన ఔషధం మరొకటి లేదు. అలసటా అనిపించినా.. ఆయాస పడినా.. కాసిన్ని నీళ్లు తాగితే రిలాక్స్ గా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కాఫీ, సోడాలకంటే మంచినీళ్లు సంతృప్తినిస్తాయి. శరీరానికి సరిపడా మంచినీళ్లు తాగితే.. మీ ఆరోగ్యం పదికాలాలపాటు బాగుంటుంది. ఉదయాన్నే నీరు త్రాగడం వల్ల పొందే 15 గొప్పు ఆరోగ్య ప్రయోజనాలు ప్రపంచంలో సహజసిద్ధంగా దొరికే నీటిని శరీరానికి సరిపడా అందించకపోవడం వల్ల.. అనారోగ్యానికి గురవుతున్నారు. మంచినీళ్లు తాగాలంటే చాలా మంది కష్టంగా ఫీలవుతారు. మేం నీళ్లు బాగానే తాగుతున్నాం అని చాలామంది చెబుతుంటారు. అయితే.. మీరు మీ శరీరానికి కావాల్సిన మోతాదులో నీళ్లు తాగుతున్నారా ? లేదా అంటే.. అనుమానమే. కాబట్టి.. మీ శరీరంలో కింద చెప్పబోయే మార్పులు కనిపించాయంటే.. మీరు సరైన మోతాదులో మంచినీళ్లు తాగడం లేదని అర్థం. ఒకవేళ ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. నీళ్లు తాగడం పెంచండి. ఇంతకీ.. ఆ సంకేతాలేంటో ఒకసారి తెలుసుకోండి. తరచుగా నోరు ఆరిపోవడం అనేది సాధారణంగా కనిపించే లక్షణం. నోట్లో కాస్త ఇబ్బందిగా, బంకగా, గొంతు పట్టేసినట్టు అనిపించిందంటే.. మీరు సరిగా నీళ్లు తాగనట్లే. అలాంటప్పుడు కూల్ డ్రింగ్స్ తాగితే.. వెంటనే ఉపశమనం కలిగినా.. తర్వాత మళ్లీ పరిస్థితి మామూలే. కాబట్టి.. వాటికి బదులు మంచినీళ్లు తాగితే.. నోటితో పాటు, గొంతులో గరగర కూడా పోయి రిలాక్స్ గా అనిపిస్తుంది. శరీరంలో అతిపెద్ద అవయవం చర్మం. నీళ్లు సరిగా తాగడం లేదని సూచించే మొదటి మార్పు డీహైడ్రేషన్. దీనివల్ల చాలా సమస్యలు మొదలవుతాయి. తక్కువగా నీళ్లు తాగడం వల్ల.. చెమట చాలా తక్కువ పడుతుంది. చెమట బాగా పడితే.. శరీరంలోని మలినాలు ఈజీగా బయటకువచ్చేస్తాయి. కానీ.. చెమట పట్టకపోతే.. చర్మంలో మార్పులు కనిపిస్తాయి. కాబట్టి మంచినీళ్లు ఎక్కవగా తాగాలి. నోరు ఆరిపోవడం గురించి తెలుసుకున్నాం.. కానీ.. ఎక్కువ దాహంగా అనిపించడం వేరే. ఎందుకంటే.. ఎక్కువ దాహం అనిపించినప్పుడు నాలుక పూర్తీగా ఎండిపోయినట్లు అనిపిస్తుంది. కాబట్టి ఇది కూడా మీరు నీళ్లు తాగలేదు అనడానికి సంకేతం. మంచినీళ్లు సరిగా తాగకపోతే నోరు, గొంతుకే కాదు.. కళ్లకు కూడా ఎఫెక్టే. మీరు తక్కువగా నీళ్లు తాగుతున్నారని మీ కళ్లే చెబుతాయి. కళ్లు పొడిబారడం, ఎర్రగా మారడం వంటి లక్షణాలు నీళ్లు సరిగా తాగలేదని సూచిస్తాయి. శరీరంలో నీటిశాతం తక్కువగా ఉంటే కళ్లీటి నాళాలు కూడా పొడిగా మారతాయి. ఇది కంటి ఆరోగ్యానికి మంచిది కాదు. మన వెన్నెముక, మృదులాస్థి 80 శాతం నీటితోనే తయారై ఉంటుంది. శరీరంలో హఠాత్తుగా జరిగే పరిణామాలైన.. రన్నింగ్, జంపింగ్, ఒక్కసారిగా పడిపోవడం వంటివి కీళ్లు తట్టుకోవాలంటే.. సరైన మోతాదులో నీళ్లు అందాలి. నీళ్లు సరిగా తాగకపోతే.. కీళ్ల నొప్పులు మొదలవుతాయి. కండరాలకు కూడా సరైన మోతాదులో నీళ్లు అవసరం. వ్యాయామానికి ముందు, తర్వాత, వ్యాయామం చేస్తున్నప్పుడు మంచినీళ్లు బాగా తాగడం వల్ల శరీరాన్ని హైడ్రేట్ గా, అనుకూలంగా ఉంచుతుంది. అంతేకాకుండా శరీరం మొత్తం.. ఎక్కుడ అవసరమైన అక్కడకి నీటిని తీసుకెళ్తుతుంది. దీనివల్ల మంట, వ్యాయామం ద్వారా వచ్చే సమస్యలకు దూరంగా ఉండవచ్చు. నీళ్లు సరిగా తాగకపోతే.. జబ్బుపడిన ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. నీళ్లు బాగా తాగితే.. శరీరంలోని మలినాలను ఈజీగా బయటకు పంపిస్తుంది. దీనివల్ల శరీరం నూతనోత్తేజంగా ఉంటుంది. శరీరానికి సరిపడా నీళ్లు అందకపోతే.. అనారోగ్య సమస్యలు ఎక్కువై.. అలసటగా అనిపిస్తూ ఉంటుంది. శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు రక్తంలోని నీటిశాతం తీసుకుని శక్తినిస్తుంది. అదే నీళ్లు సరిగా తాగనప్పుడు.. రక్తంలో కూడా నీటి శాతం తగ్గిపోతుంది. దీనివల్ల.. శరీరం మొత్తం అలసట, నీరసానికి లోనవుతుంది. ఏ పని చేయలేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు ఆకలిగా అనిపిస్తుంది. ఇలా రోజంతా ఉంటుంది. మధ్య రాత్రి ఏదో తినాలి అనిపిస్తుంది. ఎక్కువగా తినడం వల్ల శరీరానికి శ్రమ పెరుగుతుంది. ఎప్పుడుపడితే అప్పుడు ఆకలివేయడం మంచిది కాదు. నీళ్లు సరిగా తాగలేదా.. అయితే జీర్ణక్రియ సమస్యలు మొదలవుతాయి. నోటిలో హైడ్రేట్ అవడం వల్ల శ్లేష్మం డైజెషన్ కి సమస్యగా మారుతుంది. కాబట్టి శరీరానికి సరిపడా నీళ్లు తాగాలి. ఎక్కువ ద్రవ పదార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు సమస్యగా మారుతుంది. కాబట్టి జీర్ణవ్యవస్థకు సమస్య రాకుండా ఉండాలంటే.. నీళ్లు సరైన మోతాదులో తాగాలి. దీనివల్ల కాన్స్టిపేషన్ సమస్యకు దూరంగా ఉండవచ్చు. ఇదే కొన్ని సందర్భాల్లో మొలల వ్యాధికి దారితీస్తుంది. తక్కువగా యూరినేషన్ కి వెళ్తున్నారంటే.. మీరు సరిగా నీళ్లు తాగడం లేదనడానికి సంకేతం. రోజుకి 4 నుంచి 7సార్లు రెస్ట్ రూమ్ కి వెళ్లాలి. యూరిన్ కలర్ క్లియర్ గా ఉంటే ఎలాంటి సమస్యా ఉండదు. అదే కాస్త ఎల్లో కలర్ లో ఉందంటే,.. మీరు నీళ్లు సరిగా తాగకపోవడం వల్ల శరీరం డీహైడ్రేట్ కు గురైందని సంకేతం. కొన్ని సందర్భాల్లో ఇది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. నీళ్లు బాగా తాగడం వల్ల వయసు ఛాయలు కనిపించవు. చర్మం నిగారిస్తుంది. నీళ్లు తక్కువ తాగితే.. వయసు మీదపడిన వాళ్లలా, మీ వయసు కంటే పెద్దవాళ్లలా కనిపిస్తారు. చాలా మంది మేం బాగా నీళ్లు తాగుతున్నామని చెబుతుంటారు. ఎప్పుడూ నీళ్ల గ్లాస్ కానీ.. బాటిల్ కానీ పక్కనే ఉంటుందని చెబుతుంటారు. అయితే ఈ అలవాటు మంచిదే. శరీరానికి కావాల్సినంత నీళ్లు తాగితే ఆరోగ్యంగా ఉంటారు. ఒకవేళ ఎక్కువ మోతాదులో మంచినీళ్లు తాగితే వచ్చే నష్టమేమీ లేదు. దాహంగా ఉన్నప్పుడు మాత్రమే కాకుండా.. అప్పుడప్పుడు నీళ్లు తాగుతూ ఉండటం మంచిది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









