భారత్, మయన్మార్ మధ్య 11ఒప్పందాలు కుదుర్చుకున్న మోడీ
- September 07, 2017
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మయన్మార్ పర్యటన ముగిసింది. మూడు రోజులపాటు మయన్మార్‌లో బిజీగా గడిపిన ఆయన తిరుగు పయనమయ్యారు. టూర్లో చివరి రోజైన నిన్న ఉదయం యాంగన్‌లోని ష్వెడగాన్ పగోడాను సందర్శించారు. 2 వేల 500 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన ఈ పగోడాను మయన్మార్ సాంస్కృతిక వారతస్వ సంపదగా భావిస్తారు. దీన్ని సందర్శించి అక్కడి ప్రాంగణంలో బోధి మొక్కను నాటారు. తర్వాత కలిబరీ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆంగ్‌శాన్ మ్యూజియమ్‌ను కూడా మోడీ సందర్శించారు. ఈ సందర్భంగా అమరవీరుల స్తూపం వద్ద, మొఘల్ వంశంలో చిట్టచివరి చక్రవర్తి బహదూర్ షా జాఫర్ సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఈ టూర్లో మయన్మార్ స్టేట్ కౌన్సెలర్ ఆంగ్‌సాన్ సూకీ మోడీ వెంటే ఉన్నారు.
మూడు రోజుల దైపాక్షిక పర్యటనలో మోడీ మయన్మార్ ప్రభుత్వంతో పలు అంశాలపై చర్చించారు. తీవ్రవాదంపై పోరు సాగించడానికి మోడీ... మయన్మార్ స్టేట్ కౌన్సెలర్ ఆంగ్‌సాన్ సూకీతో సుదీర్ఘంగా చర్చించారు. ఆ తర్వాత మొత్తం 11 అగ్రిమెంట్లపై రెండు దేశాలు సంతకాలు చేశాయి. సముద్ర గస్తీ, మయన్మార్‌లో ప్రజాస్వామ్యబద్ధమైన సంస్థలను పటిష్టం చేయడం, ఆరోగ్యం, సాంకేతిక సమాచారం వంటి అంశాలు అగ్రిమెంట్ చేసినవాటిలో ముఖ్యమైనవి. ఈ పర్యటనతో పలు అంశాలపై భారత్, మయన్మార్ మధ్య సంబంధాలు బలపడ్డాయని తిరుగు ప్రయాణానికి ముందు మోడీ ట్వీట్ చేశారు.
చైనాలో బ్రిక్స్ దేశాల సదస్సుకు హాజరైన మోడీ... అది ముగియగానే అక్కడి నుంచి మయన్మార్ టూర్‌కు వెళ్లారు. ఈ నెల 5న మయన్మార్ చేరుకున్న మోడీ ఆ దేశాధ్యక్షుడు టిన్గ్యాతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఆ తర్వాత ఆంగ్‌సాన్ సూకీతో ఉన్నతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. మోడీ మయన్మార్‌కు ద్వైపాక్షిక పర్యటన కోసం వెళ్లడం ఇదే మొదటిసారి. 2014లో ఆసియాన్-భారత్ సదస్సు కోసం మయన్మార్ వెళ్లినా అది ద్వైపాక్షిక పర్యటన కాదు. ద్వైపాక్షిక చర్చలు విజయవంతం కావడంపై రెండు దేశాలు హర్షం వ్యక్తం చేశాయి.
తాజా వార్తలు
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!







