ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా హైదరాబాద్ మెట్రో ప్రారంభోత్సవం
- September 07, 2017
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వస్తోంది. హైదరాబాద్ మెట్రో రైలు పట్టాలెక్కేందుకు ముహూర్తం ఖరారైంది. నవంబర్ చివర్లో 30 కిలోమీటర్ల నాగోల్ -మియాపూర్ మార్గంలో మెట్రో పరుగులు పెట్టనుంది. మెట్రో ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తూ ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. పీఎంవో నిర్ణయం ఆధారంగా తేదీని ఖరారు చేయనున్నారు. మరోవైపు ప్రభుత్వ డెడ్‌లైన్ లోపు పెండింగ్ పనులు పూర్తిచేసేందుకు HMR శ్రమిస్తోంది.
హైదరాబాదీల కలల ప్రాజెక్ట్ నవంబర్‌లో పట్టాలెక్కనుంది. నాగోలు టు మియాపూర్ మార్గంలో 30 కిలోమీటర్ల మేర మెట్రో అపరేషన్స్ నిర్వహించేందుకు ఏర్పాటు శరవేగంగా సాగుతున్నాయి.ప్రభుత్వ ఆదేశాలతో HMR అధికారులు పనుల్లో వేగం పెంచారు. నవంబర్ లోపే మెట్రోను సిద్ధం చేసేందుకు శ్రమిస్తున్నారు. హైదరాబాద్‌లో మూడు కారిడార్లలో 72 కిలోమీటర్ల మేర మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. మొదటి కారిడార్‌లోని మియాపూర్ నుంచి ఎస్సార్ నగర్ వరకు.. మూడో కారిడార్‌లో నాగోల్ నుంచి మెట్టుగూడ వరకు ట్రయల్ రన్ ఎప్పటినుంచో సాగుతోంది. ప్రస్తుతం మెట్టుగూడ నుంచి అమీర్ పేట వరకు నిర్మాణ పనులు వేగంగా సాగంగా సాగుతున్నాయి. అత్యంత క్లిష్టమైన ఒలిఫెంటా బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా ముగింపుదశకు వచ్చాయి. ఇది పూర్తయితే అమీర్ పేట వరకు లైన్ క్లియర్ కానుంది. దీంతో నాగోల్ నుంచి అమీర్ పేట , మియాపూర్ మార్గంలో మెట్రో రైలును ప్రారంభించేలా ప్రభుత్వం ప్లాన్ చేసింది.
ఈ నవంబర్ 28 నుంచి 30 వరకు హైదరాబాద్ లో జరిగే ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు ప్రధాని మోడీ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. అదే సమయంలో మెట్రో రైల్ ప్రాజెక్టును ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మెట్రో మొదటిదశను ప్రారంభించాల్సిందిగా ఆహ్వానిస్తూ ప్రధానిని సీఎం కేసీఆర్ లేఖ రాశారు.
పట్టణ ప్రాంత ప్రజల రవాణా కోసం నిర్మిస్తున్న అతి పెద్ద ప్రాజెక్టుగా హైదరాబాద్ మెట్రో రైలునిలుస్తుందని ముఖ్యమంత్రి లేఖలో తెలిపారు. 15 వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు.. దేశంలోనే అతి పెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ ప్రాజెక్టు అని కేసీఆర్ గుర్తు చేశారు. గత మే నెల 25నే మెట్రో రైలు ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించిన విషయాన్నిగుర్తు చేసిన సిఎం, నవంబర్ నెలలో ఈ కార్యక్రమం పెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు నవంబర్‌లో మెట్రో ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నా..ఇంకా పనులు అసంపూర్తిగా ఉండటంతో గ్రేటర్ వాసుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మెట్టుగూడ నుంచి అమీర్‌పేట వరకు ట్రాక్ ఇంకా పూర్తిగా సిద్దం కాలేదు. ట్రాక్ పూర్తయ్యాకా.. ట్రయల్ రన్ నిర్వహించాల్సి ఉంటుంది. భద్రతాపరమైన అనుమతులు కూడా రావాల్సి ఉంది. దీనికి చాలా సమయం పడుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మెట్రో రైలు నవంబర్ వరకు ఎలా సిద్ధమవుతుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
తాజా వార్తలు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు







