'గల్ఫ్' నిర్వాసితులకు ఆత్మీయ స్వాగతం
- September 08, 2017
శంషాబాద్: ఓమాన్ దేశంలో ఉద్యోగాలు కోల్పోయి ఉత్తిచేతులతో స్వదేశం చేరిన గల్ఫ్ వలసకార్మికులకు ప్రోటోకాల్ అధికారులు, తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ ప్రతినిధులు నంగి దేవేందర్ రెడ్డి, డా. అస్మా ఖాన్ లు శనివారం ఉదయం హైదరాబాద్ ఏర్ పోర్ట్ లో ఆత్మీయ స్వాగతం పలికారు. ఒమాన్ లో పెట్రాన్ గల్ఫ్ అనే కంపెనీ మూసేయడం వలన 50 మంది తెలంగాణ కార్మికులు రోడ్డున పడ్డారు. వీరిలో జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ గ్రామానికి చెందిన బాలపెల్లి గంగారెడ్డి, కరీంనగర్ జిల్లా మంకమ్మతోటకు చెందిన బింగి రవి అనే ఇద్దరు కార్మికులు ఇండియన్ ఎంబసీ సహాయంతో ఉచిత విమాన ప్రయాణ టికెట్టు పొంది శనివారం హైదరాబాద్ కు చేరుకున్నారు. వీరు హైదరాబాద్ నుండి స్వగ్రామాలకు చేరుకోవడానికి తెలంగాణ ఎన్నారై అధికారి చిట్టిబాబు బస్ చార్జీలు చెల్లించారు.
పునరావాసం కల్పించాలి.
జీతం బకాయిలు, గ్రాట్యుటీ కలిపి ఒక్కొక్కరు 3 లక్షల రూపాయలు నష్టపోయి ఇంటికి చేరారని, ప్రభుత్వం వీరికి పునరావాసం కలిపించాలని తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నంగి దేవేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కంపెనీ యాజమాన్యం నుండి బకాయిలను రాబట్టుకోవడానికి కార్మికులు లేబర్ కోర్టులో కేసు వేశారు, రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో న్యాయ సహాయం చేయాలని ఆయన కోరారు.
బాధితుల ఫోన్ నెంబర్లు: బాలపెల్లి గంగారెడ్డి 99499 36795 బింగి రవి 96033 50632
ఇట్లు: నంగి దేవేందర్ రెడ్డి 81436 88886


తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







