యూఎస్ ఓపెన్ 2017 ఫైనల్కు చేరిన నాదల్
- September 08, 2017
టెన్నిస్ సంచలన స్టార్, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ అమెరికా ఓపెన్ టోర్నీ ఫైనల్ కు చేరుకున్నాడు. పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్లో అర్జెంటీనా ఆటగాడు జువాన్ మార్టిన్ డెల్ పొట్రోపై విక్టరీ సాధించాడు. శుక్రవారం రాత్రి జరిగిన హోరాహోరీ మ్యాచ్లో 4-6, 6-0, 6-3, 6-2 తేడాతో విక్టరీ సాధించాడు.
కాగా, ఈ విజయంతో తన కెరీర్లో 23వ గ్రాండ్ స్లామ్ టోర్నీ ఫైనల్ లో అడుగుపెట్టగా, 2013 తర్వాత యూఎస్ ఓపెన్ ఫైనల్కు నాదల్ చేరుకోవటం విశేషం. డెల్ పొట్రో రోజర్ ఫెదరర్ ను ఓడించి ఇంటికి సాగనంపిన విషయం తెలిసిందే. మరో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా స్టార్ కెవిన్ అండర్సన్, పబ్లో బుస్తాను ఓడించి ఫైనల్ కు చేరాడు. సెప్టెంబర్ 11న మెన్స్ సింగిల్స్ టైటిల్ కోసం నాదల్-అండర్సన్ల మధ్య పోరు జరగనుంది.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









