హుబ్లీలో తెలుగు విద్యార్థులను అడ్డుకున్న కన్నడ సంఘాలు
- September 09, 2017
హుబ్లీలో కన్నడిగులు వీరంగం సృష్టించారు. ఐబీపీఎస్, ఆర్ఆర్బీ పరీక్ష రాసేందుకు వచ్చిన తెలుగు అభ్యర్థులను కన్నడ సంఘాలు అడ్డుకున్నాయి. కర్ణాటక రీజినల్ రూరల్ బ్యాంక్ ఉద్యోగాలకు తెలుగువారని పరీక్షలు రాయనివ్వబోమని తేల్చి చెప్పారు. హుబ్లీలో పరీక్షలు రాయడానికి వెళ్లిన తెలుగువారిపై దాడులు చేశారు. తమ ఉద్యోగాలను తన్నుకు పోతున్నారంటూ ఆరోపించారు. హుబ్లీ, గుల్బర్గా, దావణగెరె, బెంగళూరులో ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
హుబ్లీ రైల్వే స్టేషన్ ముందు ధర్నాకు దిగిన కన్నడిగులు అక్కడే చాలా మంది తెలుగువారిని అడ్డుకున్నారు. కన్నడ గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం పరీక్షలు రాస్తే చంపేస్తామని బెదిరించారు. నంద్యాల నుంచి పరీక్ష రాయడానికి వెళ్లిన వారిపై దాడులు చేశారు. రెండు రోజుల క్రితమే కర్ణాటకకు వచ్చిన తెలుగువారిపై ఓ కన్నేశాయి కన్నడ సంఘాలు. తెలుగువారితో పాటు చాలా మంది కర్ణాటక విద్యార్థులు నంద్యాలలోనే కోచింగ్ తీసుకున్నారు. తెలుగువారు కర్ణాటకకు పరీక్షలు రాయడానికి వస్తున్నారని, వారే సమాచారం అందించారు. లాడ్జీల్లో ఉన్న వారికి సైతం హెచ్చరికలు జారీ చేశారు. లాడ్జీల్లో తెలుగువారికి రూమ్ ఇవ్వొద్దని, ఆటోల్లో ఎక్కించుకోవద్దని హుకుం జారీ చేశారు. అటు పరీక్ష సెంటర్ల దగ్గరా అడ్డుకుంటామని చెప్పడంతో తెలుగు అభ్యర్థులు భయపడిపోతున్నారు. కన్నడ సంఘాల తీరుతో అంతరాయాలు కలగడంతో పరీక్షను అధికారులు రద్దు చేశారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







