భాగ్యనగరంలో ఐసిస్ కలకలం
- September 09, 2017
నగరంలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) జాడలు కనిపించడం కలకలం రేపింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు శనివారం ముగ్గురు ఐసిస్ ఉగ్రవాదులను అరెస్టుచేశారు. టోలీచౌక్ ప్రాంతంలో అబ్దుల్ మాలిక్, ఫజులుల్లా, ఖయ్యూం అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఐసిస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాల విషయమై ఈ ముగ్గురిని ఎన్‌ఐఏ అధికారులు ప్రస్తుతం విచారిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో వీరు ప్రధానంగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. లక్నో నుంచి వచ్చిన ఎన్‌ఐఏ అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో ఉదయం టోలిచౌక్‌లోని వీరి నివాసంపై దాడులు చేసి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఐసిస్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం, వారి కార్యకలాపాలకు సహకరించడం వంటి చర్యలకు వీరు పాల్పడ్డట్టు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. వీరికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







