మునిగిపోతున్న నౌక నుండి 20 మందిని రక్షించిన సాహసవీరునికి సత్కారం
- September 09, 2017
మస్కట్ : నడి సముద్రంలో మునిగిపోతున్న ఒక నౌక నుండి మొత్తం సిబ్బందిని రక్షించిన ఒమన్ మత్స్యకారుడు ఫయీజ్ అల్ జునిబి సాహసానికి ఒమన్ రవాణా మంత్రి డాక్టర్ అహ్మద్ బిన్ మహ్మద్ బిన్ సలీం అల్ ఫుటీసీక కృతజ్ఞతలు తెలిపారు. దుఖ్మ్ మత్స్యకారుడు మంత్రిని కలుసుకున్నారు. మునిగిపోతున్న ఓడ నుంచి 20 మందిని కాపాడిన ఆయన ప్రయత్నాలకు గాను ప్రభుత్వం ఆయనకు అందించిన ప్రశంసపత్రాన్ని ఈ సందర్భంగా ఆయనకు అందించారు. "అల్ జజీర్ తీరానికి చెందిన మునిగియున్న ఓడ యొక్క సిబ్బందిని రక్షించిన ఫయీస్ అల్ జునిబి సాహసం ఒక అత్యున్నతమైన మానవతా చర్య, "మంత్రి ఆన్లైన్ లో తెలిపారు. వారాంతంలో ఓ ఓడ సముద్రంలో ప్రయాణిస్తూ ఇబ్బందులను ఎదుర్కొంది.అంతేకాక నీరు నౌకలోనికి రావడం మొదలైంది. ఎదుర్కొంటున్నఇబ్బంది గూర్చి ఓడ సిబ్బంది సమీపంలో ఉన్న చేపలను వేటాడే పడవకు సందేశం పంపారు. దాంతో స్పందించిన మానవత్వం ఉన్నమత్స్యకారుడు ఫయాజ్ విజయవంతంగా అక్కడకు చేరుకొని 25 నిమిషాల వ్యవధిలో వారినందరిని ఆయా విపత్తు నుండి రక్షించి తన చేపలను వేటాడే పడవ లోనికి ఎక్కించుకొని అక్కడి నుంచి సురక్షితంగా తీసుకువచ్చారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







