ఒక బెంగాలీ సినిమాలో సన్నీలియోన్ ఐటెం సాంగ్

- September 09, 2017 , by Maagulf
ఒక బెంగాలీ సినిమాలో సన్నీలియోన్ ఐటెం సాంగ్

బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోన్ ఓ బెంగాలీ చిత్రంలో చిందులేస్తుంది.  శ్రేష్టా బంగాలీ అనే చిత్రంలో ఐటెం సాంగ్ చేసింది.  డెబ్యూ యాక్టర్ రిజు గ్రూప్స్‌ తో కలిసి చాప్ నిషానా అనే పాటకి ఆడి పాడింది.  దీంతో అటు హిందీలోనేకే కాక ఇటు బెంగాలీలో కూడా అభిమానుల్ని సంపాదించుకుంటోంది.  స్వపన్ సాహ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో రాజ్‌పాల్ యాదవ్, శక్తి కపూర్, రాజతావా దుత్తా, లబానీ సర్కార్, ఉల్కా గుప్తా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  చిట్ మహల్‌లో నివసిస్తున్న ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఈచిత్రంలో ప్రధానంగా చూపిస్తున్నారు. సన్నీ ఐటెం సాంగ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com