బ్లూ కాలర్ వర్కర్స్ క్యాంపెయిన్‌కి అవార్డ్
- September 09, 2017
దుబాయ్: ఎక్స్‌ప్రెస్ మనీ సంస్థకు దుబాయ్ పోలీస్ జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాఫిక్ నుంచి అవార్డ్ దక్కింది. బ్లూ కాలర్ వర్కర్స్‌కి సంబంధించి పెడెస్ట్రియన్ సేఫ్టీ క్యాంపెయిన్ నిర్వహించినందుకుగాను ఎక్స్‌ప్రెస్ మనీ ఈ పురస్కారం దక్కించుకుంది. 'క్రాస్ సేఫ్లీ' పేరుతో ఈ కార్యక్రమాన్ని ఎక్స్‌ప్రెస్ మనీ నిర్వహించింది. జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాఫిక్ డైరెక్టర్ బ్రిగేడియర్ సైఫ్ ముహైర్ దుబాయ్ పోలీస్ ట్రోఫీ, సర్టిఫికెట్స్ ఆఫ్ ఏప్రీషియేషన్‌ను ఎక్స్‌ప్రెస్ మనీ టీమ్ మెంబర్స్‌కి అందజేశారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాఫిక్ హెడ్ క్వార్టర్స్‌లో ఈ కార్యక్రమం జరిగింది. బ్లూ కాలర్ కమ్యూనిటీకి సంబంధించినంతవరకు పలు అవేర్‌నెస్ క్యాంపెయిన్స్‌ని నిర్వహిస్తూ ఎక్స్‌ప్రెస్ మనీ తన ప్రత్యేకతను చాటుకుంటోందని ఈ సందర్బంగా వక్తలు అభిప్రాయపడ్డారు. ఎక్స్‌ప్రెస్ మనీ సిఓఓ సుదేష్ గిరియాన్ మాట్లాడుతూ, తమ సిబ్బంది ఈ విషయంలో చూపుతున్న ప్రత్యేకమైన శ్రద్ధను అభినందించారు. దుబాయ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ తమకు సేవా రంగంలో సహకరిస్తున్నందుకు ఆనందంగా ఉందని చెప్పారాయన.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







