'సాయే దైవం' సెన్సార్‌ పూర్తి

- September 10, 2017 , by Maagulf
'సాయే దైవం' సెన్సార్‌ పూర్తి

హైదరాబాద్‌: విజయ్‌చందర్‌ సాయిబాబాగా నటించిన చిత్రం 'సాయే దైవం'.జీఎల్‌బీ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించారు. జీఎల్‌బీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించింది. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకుని క్లీన్‌ యు సర్టిఫికెట్‌ పొందినట్లు నిర్మాత పేర్కొన్నారు. షిర్డీ సాయిబాబా భక్తుల అనుభవాలను ప్రధానాంశంగా చిత్రాన్ని తెరకెక్కించినట్లు చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని బాబా ఆలయాల్లో చిత్రీకరణ జరిపినట్లు తెలిపారు.
ఈ చిత్రంలో సుమన్‌, చంద్రమోహన్‌, కోట శ్రీనివాసరావు, రావు రమేశ్‌, సాయిప్రకాశ్‌, ఎల్‌బీ శ్రీరామ్‌, ధన్‌రాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. పోలూర్‌ ఘటికాచలం సంగీతం, మాటలు అందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com