రాజకీయం

- March 26, 2015 , by Maagulf
రాజకీయం

రాజకీయం, రంగులమయం

రోజు,రోజుకి  రణ రంగమయం                                       

మాయ రోగమున్న మహనీయులు

మామూలు మనుషుల్ని మట్టి బొమ్మలుగా

చేసి గారడీ చూపెట్టే రాజకీయం!!

 

విపణి వీధిలో విచ్చలవిడిగా

అమ్ముడుపోయే "ఓటు"

సగటు మనిషి కోల్పోయిన హక్కు,

జీవితమంతా తెలియని చిక్కు!

 

రాజులేలిన రాజ్యాలు రాబందుల పాలై,

రామరాజ్యమొక చోద్యమైపోయింది

రక్తపాతమే నిత్య నైవేద్యమైపోయింది!

 

రహదారులే మృత్యుకు హారాలు,

రైలు బండ్లే సజీవ దహనానికి అఘ్నిగుండాలు!

 

రాజకీయమేమి రాజ్యమేలు?

ప్రజలకేమి జరుగు మేలు?

 

మంత్రి పదవి లో మన అన్న

అండదండలున్న ఆకలి దున్న!

మనవాడని మనవి చేయ బోతే...

మందు బాటిలైన తేలేదా సాంబా! అంటాడు

 

దేవబ్రాహ్మణ మాన్యములు తాకవద్దన్నాడు,

అలనాడు హరిశ్చంద్రుడు!

కలియుగం లో అవతార పురుషుడి

ఆస్తులనే కబళించి దోచుకునే దొరలున్న

రాజ్యం మనది,కేంద్రం లో లక్షల కోట్ల

రాష్ట్రం లో కోట్ల లక్షలు నిలువుదోపిడి!

 

దోచుకున్న రూపాయలు

దాచుకున్న మహానుభావులు

భారీగా ఎదిగిన భారతీయులే

ఇదే భారతీయం రాజకీయం

భారతదేశం, మనదేశం! యువతకి మహోపదేశం

                                                                 ----డాక్టర్ కోడి రామ, ఎం ఎస్ ఆర్తో, యు ఏ యి

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com